ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఓ తేలికపాటి విమానం శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తుగా ఉత్తర్ ప్రదేశ్‌లోని బాఘ్‌పట్‌కి సమీపంలోని చెరుకు పంట చేనులో కూలిపోయింది. అదృష్టవశాత్తుగా ఈ ఘటనలో ఇద్దరు పైలట్స్ సహా ఎవ్వరికీ ఎటువంటి హానీ జరగలేదు. ఈ ఘటనలో భూమి మీదకు దూసుకొచ్చిన విమానం ముందు భాగం నేలను ఢీకొని ఆగింది. ఈ ఘటనపై స్పందించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగం మీడియా ప్రతినిధి .. "గతంలో ఎన్నడూ ఈ తరహా ప్రమాదం చోటుచేసుకోలేదని, ఘటనలో ఇద్దరు ఫైలట్స్ సురక్షితంగా బయటపడ్డారు"అని తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే అది కూలిపోయినట్టు మీడియా ప్రతినిధి చెప్పారు.
An IAF plane has been forced land in Baghpat. The Pilot is safe. More details awaited. pic.twitter.com/jAPjhcyCJr
— ANI UP (@ANINewsUP) October 5, 2018