YCP Election Manifesto: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అధికార, ప్రతిపక్షాలు సిద్ధమౌతున్నాయి. వైనాట్ 175 లక్ష్యంలో బరిలో దిగుతున్న వైఎస్ జగన్ ఇప్పటికే అభ్యర్ధుల్ని సమూలంగా మార్చుతున్నారు. అన్ని సామాజికాంశాలు పరిగణలో తీసుకుని అభ్యర్ధుల్ని ఎంపిక చేస్తున్నారు. సిద్ధం సభలతో ప్రతిపక్షాల్ని కలవరపెడుతున్న జగన్..ఈసారి మరో సిద్ధం సభకు సిద్ధమయ్యారు. ప్రతిపక్షాల్ని కలవరపెట్టే ఆస్త్రంతో ఈసారి సిద్ధం సభ జరగనుంది.
ఏపీలో భీమిలిలో ఏర్పాటు చేసిన సిద్ధం సభతో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన వైఎస్ జగన్ ఆ తరువాత దెందులూరు, రాప్తాడుల్లో మరింత భారీగా సిద్ధం సభలు నిర్వహించారు. ఇక మరో ఐదు రోజుల్లో అంటే మార్చ్ 10వ తేదీన ప్రకాశం జిల్లా మేదరమెట్లలో నాలుగవ సిద్ధం సభ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ జరిగిన మూడు సిద్ధం సభలు ఒక ఎత్తైతే నాలుగో సిద్ధం సభ మరో ఎత్తు. ఎందుకంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అదే రోజూ విడుదల కానుంది. మేధావులు, సీనియర్ నేతలు, ఐఏఎస్ అధికార్లతో చర్చించి, సమీక్షించి అత్యంత ఆకర్షణీయమైన మేనిఫెస్టో రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది.
2019లో నవరత్నాలే అధికార పార్టీకి అఖండ విజయాన్ని అందించాయనేది అందరికీ తెలుసు. అందుకే తూచా తప్పకుండా దాదాపుగా 95 శాతం ఎన్నికల హామీల్ని అమలు చేసింది ప్రభుత్వం. తద్వారా ప్రజల్లో నమ్మకాన్ని ఏర్పర్చుకుంది. అందుకే ఈసారి మరింత ఆకర్షణీయమైన మేనిఫెస్టోతో ప్రజల సహకారం పొందేందుకు యోచిస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షాల్ని సందిగ్దంలో పడవేసేలా రైతు రుణమాఫీ హామీ ఇచ్చేందుకు వైఎస్ జగన్ సిద్ధమైనట్టు సమాచారం. రైతు రుణమాఫీతో పాటు నిరుద్యోుగులకు ఉద్యోగాలు, మరి కొన్ని ఆకర్షణీయమైన హామీలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఈసారి పెన్షన్‌ను 4 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నారు.
ఎందుకంటే 2019లో ఇచ్చిన హామీల్ని వైఎస్ జగన్ దాదాపుగా అమలు చేశారు. జాబ్ క్యాలెండర్, మద్యపాన నిషేదం, సీసీఎస్ రద్దు మినహాయించి అన్నీ అమలయ్యాయి. అందుకే ఇప్పుుడు వైసీపీ విడుదల చేయనున్న ఎన్నికల మేనిఫెస్టో అప్పుడే ప్రత్యర్దుల్ని కలవరపెడుతోంది.
Also read: Tax Free Incomes: ఈ 5 రకాల ఆదాయాలపై ట్యాక్స్ ఉండదని మీకు తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook