Gratuity Rules: గ్రాట్యుటీ అంటే ఏమిటి, ఎంత కట్ అవుతుంది, ఎప్పుడు చేతికి అందుతుంది

Gratuity Rules: గ్రాట్యుటీ అనేది ఉద్యోగులకు వర్తించేది. ఉద్యోగ విరమణ సమయంలో చేతికి అందే మొత్తం ఇది. మీ జీతం నుంచే నెల నెలా కట్ అవుతుంటుంది. చాలామందికి గ్రాట్యుటీ గురించి పూర్తి సమాచారం తెలియదు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 3, 2024, 03:13 PM IST
Gratuity Rules: గ్రాట్యుటీ అంటే ఏమిటి, ఎంత కట్ అవుతుంది, ఎప్పుడు చేతికి అందుతుంది

Gratuity Rules: గ్రాట్యుటీ అనేది ఉద్యోగులకు కంపెనీ అందించే ఓ సౌకర్యం. ప్రతి నెలా జీతం నుంచి కొంతమొత్తం కట్ అవుతుంటుంది. అయితే ఎంత మొత్తం కట్ అవుతుంది, ఎప్పుడు చేతికి వస్తుంది, అసలు వస్తుందా లేదా అనే వివరాలు చాలామంది పట్టించుకోరు. ఉద్యోగంలో చేరినప్పుడు కంపెనీ మనకిచ్చే ఆఫర్ లెట్‌లో అన్ని వివరాలు పూర్తిగా ఉంటాయి.

సాధారణంగా అందరూ హెచ్ఆర్ఏ, సీటీసీ ఎంత, బేసిక్ శాలరీ వంటి వివరాలపైనే దృష్టి సారిస్తుంటారు. గ్రాట్యుటీ గురించి పట్టించుకోరు. ఇది కూడా ఓ రకంగా అలవెన్స్ లాంటిది. గ్రాట్యుటీ అనేది ప్రతి నెలా మీ జీతం నుంచే కట్ అవుతుంటుంది. ఆఫర్ లెటర్‌లో గ్రాట్యుటీ వివరాలుంటాయి. కంపెనీ ఇచ్చే సీటీసీ ప్యాకేజ్ అంంటే కాస్ట్ టు కంపెనీలో గ్రాట్యుటీ వాటా ఎంత అనేది ఉంటుంది. సాధారణంగా చాలా కంపెనీలు 4.81 శాతం బేసిక్ శాలరీ నుంచి గ్రాట్యుటీ రూపంలో కట్ చేస్తుంటారు. 

కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల కోసం గ్రాట్యుటీ చట్టం రూపకల్పన చేసింది. 1972 గ్రాట్యుటీ చట్టం ప్రకారం బేసిక్ శాలరీ నుంచి ప్రతి నెలా 4.81 శాతం డిడక్ట్ చేస్తారు. ఓ ఉద్యోగి వార్షిక జీతం 5 లక్షల రూపాయలనుకుంటే..4.81 శాతం గ్రాట్యుటీగా లెక్కేస్తే ఏడాదికి 24,050 రూపాయలు గ్రాట్యుటీ ఫండ్‌లో డిపాజిట్ అవుతుంది. అంటే ప్రతి నెలా కంపెనీ 2 వేల రూపాయలు కట్ చేస్తుంటుంది. ఉద్యోగి జీతం నుంచి కట్ చేసే మొత్తం కాబట్టి గ్రాట్యుటీ చెల్లించాల్సిన బాధ్యత కంపెనీదే అవుతుంది. 

1972 గ్రాట్యుటీ చట్టం ప్రకారం ఉద్యోగులకు గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. అందుకే ప్రతి నెలా కొంతమొత్తం జీతం నుంచి కట్ అవుతుంటుంది. ఒకే కంపెనీలో 5 ఏళ్లు పనిచేస్తే ఆ ఉద్యోగి గ్రాట్యుటీకి అర్హుడౌతాడు.ఐదేళ్లలోపు ఉద్యోగం మారితే మాత్రం కంపెనీ గ్రాట్యుటీ చెల్లించదు. 

Also read: Motorola Edge 50 Pro: 50MP ఆర్టిఫిషియల్ కెమేరాతో కొత్త ఫోన్ లాంచ్ నేడే, ధర ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News