Varun Sandesh: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సాయి రాజేష్ చేతులు మీదుగా విడుదలైన వరుణ్ సందేశ్ 'విరాజి' ఫస్ట్ లుక్ విడుదల..

Varun Sandesh: వరుణ్ సందేశ్ తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ తో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ వెరైటీ కాన్సెప్ట్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ కోవలో వరుణ్ సందేశ్ ముఖ్యపాత్రలో  నటిస్తూన్న మరో మూవీ ‘విరాజి’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 11, 2024, 03:25 PM IST
Varun Sandesh: బ్లాక్ బస్టర్ డైరెక్టర్  సాయి రాజేష్ చేతులు మీదుగా విడుదలైన వరుణ్ సందేశ్ 'విరాజి' ఫస్ట్ లుక్ విడుదల..

Varun Sandesh: వరుణ్ సందేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘విరాజి’  మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను  బ్లాక్ బస్టర్ బేబీ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సాయి రాజేష్ గారు మాట్లాడుతూ.. రీసెంట్ గా  విరాజి టీజర్ చూసాను.  పర్ఫెక్ట్ గా ఉంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. వరుణ్ సందేశ్ లుక్ బాగుంది. క్యారెక్టర్ కోసం అంత డెడికేషన్ తో పని చేస్తున్న వరుణ్ సందేశ్ కి ఈ సందర్భంగా మెచ్చుకోవాల్సిందే.
ప్రమోషన్ లో కూడా తన క్యారెక్టర్ గెట్ అప్ లో పర్మనెంట్ హెయిర్ కలర్ లో ఉండటం చాలా అరుదు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  అలాగే దర్శకుడు ఆద్యంత్ హర్ష మా నెల్లూరు వాడు కావడం చాలా ఆనందించదగ్గ విషయం.  మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఆగస్టు 2న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. నిర్మాతకు కాసుల వర్షం కురిపిస్తుందని ఆశిస్తున్నాను.

వరుణ్ సందేశ్ మాట్లాడుతూ..
మా విరాజి చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను బేబీ డైరెక్టర్ విడుదల చేయడం సంతోషంగా  ఉందన్నారు.  ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. సినిమా చాలా బాగా వచ్చింది.  ఆగస్టు 2న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పక   అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

దర్శకుడు ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ..  
‘విరాజి’ నా ఫస్ట్ మూవీ. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ను సాయి రాజేష్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. వరుణ్ సందేశ్ లుక్ కి కథ కి చాలా దగ్గరి సంబంధం ఉందన్నారు.ఆగష్టు 2న ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది.
 
నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ..

"విరాజి అనే మంచి చిత్రాన్ని నిర్మించాము. ఈ రోజు ఫస్ట్ లుక్ టీజర్ ని సాయి రాజేష్ .. విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆగస్టు 2న విడుదల కాబోతున్న ఈ చిత్రం అందరికి నచ్చుతుందన్నారు.

సినిమా పేరు: విరాజి...నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా, తదితరులు...

సాంకేతిక సిబ్బంది:దర్శకుడు: ఆద్యంత్ హర్ష, మేకప్ చీఫ్: భానుప్రియ అడ్డగిరి
ప్రాజెక్ట్ హెడ్: సుకుమార్ కిన్నెర,ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మల్లికార్జున్ కిన్నెర, ప్రొడక్షన్ మేనేజర్: శ్రావణ్ కుమార్ వందనపు, పి ఆర్ ఓ: పవన్ పాల్,పోస్ట్ ప్రొడక్షన్: సారధి స్టూడియోస్, వి ఎఫ్ ఎక్స్ : అఖిల్,పోస్టర్ డిజైన్స్: జి.దినేష్, గణేష్ రత్నం,స్టిల్స్: మోహన్
అవుట్ డోర్ పబ్లిసిటీ: రత్నకుమార్ శీలం,డిజిటల్ పి ఆర్ : ఎస్ 3 డిజిటల్ మీడియా వర్క్స్,ఆడియో ఆన్: శబరి మ్యూజిక్,నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల, బ్యానర్: ఎమ్ 3 మీడియా, మహా మూవీస్, డి ఓ పి : జి.వి. అజయ్ కుమార్,సంగీతం: ఎబినేజర్ పాల్ (ఎబ్బి)
ఎడిటర్: రామ్ తూము, కాస్ట్యూమ్ డిజైనర్: రోజా భాస్కర్

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News