Heavy Rains in Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఉత్తర ఒడిశావైపుకు కదులుతోంది. ఇవాళ పూరీ సమీపంలో తీరం దాటనుంది. ఫలితంగా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరి కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు అంటే మంగళవారం వరకూ భారీ వర్షాలు తప్పేట్లు లేవు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం కళింగపట్నానికి తూర్పున 280 కిలోమీటర్ల దూరంలో గోపాల్పూర్ వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది కాస్తా వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయగుండంగా మారవచ్చని ఐఎండీ స్పష్టం చేసింది. ఇవాళ రాత్రికి పూరి-దిఘా మధ్యలో వాయుగుండం తీరం దాటనుంది. ఈ వాయుగుండం తుపానుగా మారే అవకాశాల్లేవని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాయుగుండం కారణంగా తెలంగాణలోని ఉత్తర ప్రాంతంలో భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ సూచించింది.
ముఖ్యంగా కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, ఖమ్మం, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఇవాళ, రేపు అంటే సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఉత్తర తెలంగాణ మినహా మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తర తెలంగాణలో మాత్రం భారీ వర్షాలు పడనున్నాయి.
ఈ సీజన్లో ఇప్పటి వరకు 62.31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావల్సి ఉండగా ఇప్పటికే 88.45 సెంటీమీటర్లు కురిసింది. అంటే సాధారణం కంటే 42 శాతం అధికంగా నమోదైంది. మహబూబాబాద్, సిద్ధిపేట, మహబూబ్ నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణ పేట్ జిల్లాల్లో అత్యదికంగా వర్షపాతం నమోదైంది. అదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. వాస్తవానికి ఆగస్టు చివరి వారం వరకు రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉంది. కానీ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 5 వరకూ కురిసిన భారీ వర్షాలతో లోటు పోయింది.
Also read: AP Heavy Rains Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.