LYF: తండ్రికి కొడుకుల అనుబంధాన్ని తెలిపే ‘లవ్ యువర్ ఫాదర్’.. షూటింగ్ పూర్తి..

LYF: తెలుగులో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలిపే సినిమాలు ఎన్నో వచ్చాయి. ఈ కోవలో వచ్చిన మరో సినిమా ‘లవ్ యువర్ ఫాదర్’. మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నప రెడ్డి స్టూడియోస్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ,  ఏ. రామస్వామి రెడ్డి నిర్మించారు. పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 24, 2024, 03:37 PM IST
LYF: తండ్రికి కొడుకుల అనుబంధాన్ని తెలిపే  ‘లవ్ యువర్ ఫాదర్’..  షూటింగ్ పూర్తి..

LYF: శ్రీహర్ష, కషిక కపూర్ జోడిగా నటించిన లేటెస్ట్ మూవీ  LYF (లవ్ యువర్ ఫాదర్). ఎస్. పి. చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా, సంధ్య ఇతర  లీడ్ రోల్ల్ యాక్ట్ చేశారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా  ఈ సినిమా షూటింగ్  పూర్తయింది. అతి త్వరలో ఈ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ టీం మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కేతరాజు మాట్లాడుతూ..  కొడుకు బాధ్యత తీర్చేందుకు తండ్రి పడే ఆరాటం.. తండ్రి కోసం కొడుకు చేసే పోరాటం నేపత్యంలో మా ఈ ‘లైఫ్’ సినిమాను తెరకెక్కించినట్టు చెప్పుకోచ్చిరు. సినిమా స్టోరీ అంతా కాశీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతూ శివతత్వాన్ని చూపించమన్నారు. ఈ ప్రయత్నం అందరికీ నచ్చతుందనే విషయాన్ని ప్రస్తావించారు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటరటైనర్ సినిమాగా ఈ సినిమాని తెరకెక్కించామన్నారు.  హీరో శ్రీహర్ష మొదటి సినిమా అయినా చాలా చక్కగా నటించాడు. హీరో తండ్రి పాత్రలో ఎస్పి చరణ్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. రఘు బాబు, షకలక శంకర్, ప్రవీణ్ కామెడీ టైమింగ్  ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. శ్యామ్ కె నాయుడు గారు సినిమాటోగ్రఫీ విజువల్ వండర్ గా తెరపై కనిపిస్తుందన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా ఆడియన్స్ ను  నచ్చుతుందన్నారు.

హీరోయిన్ కషిక కపూర్ మాట్లాడుతూ : ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు కి కృతజ్ఞతలు. కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ  ప్రొడక్షన్ వైస్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందన్నారు.

హీరో శ్రీహర్ష మాట్లాడుతూ : లైఫ్... తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించే ఒక ఫీల్ గుడ్ మూవీ. ఈ రోజు ఈ సినిమా షూటింగ్ లాస్ట్ వర్కింగ్  డే. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. కచ్చితంగా అందరికీ నచ్చుతుందన్నారు.

నిర్మాత అన్నపరెడ్డి రామస్వామి రెడ్డి మాట్లాడుతూ .. ఆరు నెలల క్రితం ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాము. నేటితో షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేసాము. త్వరలో  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ లో ఉంది. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము. నిమా చాలా అద్భుతంగా వచ్చింది. డైరెక్టర్ పవన్, సినిమాటోగ్రఫీ శ్యామ్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ చాలా కష్టపడ్డారు. సినిమా ఎక్కువ శాతం కాశీలో షూట్ చేసాం. దైవత్వంతో పాటు తండ్రి కొడుకులు మధ్య ఉన్న బంధాన్ని కూడా చాలా బాగా తెరపై చూపిస్తున్నాము. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ ఇష్టపడి నటించారు. మా మూవీ టీమ్ అందరికీ ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

నటీనటులు : శ్రీహర్ష, కషిక కపూర్, ఎస్. పి. చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా, సంధ్య తదితరులు.

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

Trending News