Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కేంద్రంలోని బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించబోతోందా ? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్రం హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పవన్ కల్యాణ్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు ముంబై, థానే తో పాటు పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించే అవకాశాలున్నాయట. మరోవైపు పవన్ కళ్యాణ్.. రెండో భార్య రేణు దేశాయ్ ది కూడా మహారాష్ట్ర కావడం విశేషం. మరోవైపు మహారాష్ట్రలో తెలుగు ప్రజలున్న చోట పవన్ తో ప్రచారం చేయించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.
ఒక రకంగా పవన్ కళ్యాణ్.. మహారాష్ట్రకు అల్లుడు విశేషం. సనాతన ధర్మం కోసం పోరాటం చేపట్టి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించారు. ఇటీవలె హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పవన్ కళ్యాణ ను కలిసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఆయన్ని సనాతన్ బాబు అంటూ సంభోదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వక్ఫ్ బోర్డు తరహాలో సనాతన బోర్డు తీసుకురావాలంటూ పవన్ కల్యాణ్ కోరుతుంటంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగినట్లు సమాచారం.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.