Balakrishna: బంగారం కొనాలన్న బాలయ్య.. షూటింగ్‌‌లో హీరోయిన్‌తో రచ్చ మాములుగా లేదుగా..

Nandamuri Balakrishna: నందమూరీ బాలకృష్ణ ప్రస్తుతం షూటింగ్ కోసం తూర్పుగోదావరికి వెళ్లారు. అక్కడ పచ్చదనం చూసి చాలా సంతోషపడినట్లు తెలుస్తొంది. అక్కడి నేచర్ అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవన్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 5, 2024, 06:46 PM IST
  • తూగోజి వెళ్లిన బాలయ్య..
  • వేద పండితులకు పుట్టినిల్లని కామెంట్లు..
Balakrishna: బంగారం కొనాలన్న బాలయ్య.. షూటింగ్‌‌లో హీరోయిన్‌తో  రచ్చ మాములుగా లేదుగా..

balakrishna visits east godavari: హిందుపురం ఎమ్మెల్యే నందమూరీ బాలయ్య ప్రస్తుతం ఒక వైపు రాజకీయాల్లో తనదైన హవా కొనసాగిస్తునే.. మరొవైపు అన్  స్టాపబుల్ టీవీ షోతో ప్రత్యేక కార్యక్రమంలో.. కూడా రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోలో పొలిటికల్ పార్టీల నేతల్ని అదే విధంగా  సినిమా హీరోలు, హీరోయిన్లను గెస్టులుగా పిలిచి వారితో హల్ చల్ చేస్తున్నారు. బాలయ్య ఫన్నీ క్వశ్చన్ లతో అతిథులను కార్నర్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. నందమూరీ బాలకృష్ణ తాజాగా.. తూర్పుగోదావరి జిల్లాలో షూటింగ్ కోసం వెళ్లినట్లు తెలుస్తొంది. అదే విధంగా అక్కడి వాతావరణంను, పచ్చదనం గురించి గొప్పగా చెప్పారు. ఈ నేపథ్యలో బాలయ్య మాట్లాడుతూ.. తన అత్తగారిది కృష్ణాజిల్లా అని,  మామ గారిది తూర్పుగోదావరి జిల్లాగా చెప్పుకొచ్చారు. చాలాకాలం తర్వాత కాకినాడ వచ్చానని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా.. వేదాలకు, వేద పండితులకు పుట్టినిల్లని అన్నారు. తన మామ దేవరపల్లి సూర్యారావు కాకినాడలోనే ఉంటారన్నారు. అదే విధంగా..  మోక్షజ్ఞను ఆదరించాలని కోరారు.

సాధారణంగా తనకు యాడ్స్ .. అంటే అంతగా ఆసక్తిలేదని, కానీ.. ఒకసారి అడుగు పెడితే ముందుకు పోవడమే తిరుగు ఉండదని క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా .. అన్ స్థాపబుల్ షోకి ఉపముఖ్యమంత్రి వస్తారా అని అడిగి ఇబ్బంది పెట్టొద్దన్నారు. ప్రస్తుతం రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. అయితే.. బంగారం కొంటే.. నష్టమేమిలేదని.. భవిష్యత్ లో ఉపయోగపడుతుందన్నారు.

అదే విధంగా కూటమి సర్కారుపై ప్రశంసలు కురిపించారు. పేదల  అభివృద్ధికి ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నాయన్నారు. అదే విధంగా.. బాలయ్య కొన్ని సార్లు స్టేజీ మీద, ఇంటర్వ్యూలలో తనబడుతారని విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆయన కాస్త తనబడ్డారని తెలుస్తొంది.

Read more: Tirumala: వీళ్లు మారరా? తిరుమల కొండ వద్ద 'కిస్సిక్‌' సాంగ్‌కు యువతి డ్యాన్స్‌ వైరల్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

హీరోయిన్ సంయుక్త మీనన్ ను.. నిత్యా మీనన్ అనబోయి.. మరల సవరతించుకుని..సంయుక్త మీనన్  బాలకృష్ణ అన్నట్లు తెలుస్తొంది. దీంతో సదరునటి కాస్తంత ఫన్నీగా ఫీలయ్యినట్లు సమాచారం. ప్రస్తుతం మారెడు మిల్లిలో షూటింగ్ కోసం వచ్చినట్లు బాలయ్యబాబు చెప్పుుకొచ్చారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News