Lavanya Tripathi Upcoming Movies: గత కొద్దిరోజులుగా సినిమాలకి దూరంగా ఉన్న మెగా కోడలు లావణ్య త్రిపాఠి తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాని ప్రకటించింది. ఈ ఏడాది మొదటి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో కనిపించిన లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో ఇప్పుడు సతీ లీలావతి అనే సినిమాలో నటిస్తోంది. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాకి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 15న ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. తన డిఫరెంట్ పాత్రలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న లావణ్య ఈ చిత్రంలో మరొక భిన్నమైన పాత్రలో కనిపించనుంది అని టైటిల్ చూస్తేనే తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుండగా, ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తున్నారు. కోసనం విఠల్ ఆర్ట్ డైరెక్టర్‌గా, సతీష్ సూర్య ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Extremely excited to be a part of this project! This story caught my attention with its amazing write-up and solid team. I’m thrilled to be starting this next year
what a fantastic way to kick off the year!
.
.#tatinenisatya @MickeyJMeyer
#binendramenon #kosanamvithal… pic.twitter.com/D0KIddRreI— Lavanyaa konidela tripathhi (@Itslavanya) December 15, 2024
ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడవుతాయి. త్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటిస్తామని చిత్ర బృందం తెలియజేసింది. మరి ఈ సినిమాతో లావణ్య త్రిపాఠి ఎంతవరకు హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.
వరుస ఫ్లాప్స్ అందుకుంటున్న మెగా కోడలు 2021లో చావు కబురు చల్లగా సినిమాతో పర్వాలేదు అనిపించినా.. 2022లో వచ్చిన హ్యాపీ బర్త్‌డే సినిమాతో మాత్రం మళ్లీ ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఈ సినిమాతో అయినా లావణ్య మళ్ళీ మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలి అని ఫాన్స్ ఆశిస్తున్నారు.
ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.