Zakir Hussain: తబాలా విధ్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స

Zakir Hussain Passed Away At 73: భారత సంగీతానికి ఎనలేని సేవలు అందించిన విశ్వవిఖ్యాత తబాలా విధ్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 15, 2024, 11:45 PM IST
Zakir Hussain: తబాలా విధ్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ పరిస్థితి విషమం.. ఐసీయూలో చికిత్స

Zakir Hussain: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తబాలా విధ్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. . ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అమెరికాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.

Also Read: YSRCP Win: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు 2027లోనే.. అందరూ సిద్ధంగా ఉండాలి

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న ఉస్తాద్‌ జాకీర్‌ హుస్సేన్‌ (73) కొంత కాలంగా హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఆదివారం అస్వస్థతకు గురి కాగా వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో ఉంచి అత్యవసర చికిత్స అందించారు. అయితే ఆయన చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి సాయంత్రం కన్నుమూశారు. ఈ విషయాన్ని అతడి అత్యంత ఆప్తమిత్రుడు.. ప్రముఖ ఫ్లూయిస్ట్‌ రాకేశ్‌ చౌరసియా ధ్రువీకరించారు.

Also Read: Chandrababu: హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఏడేళ్ల ప్రాయంలో
ముంబైకి చెందిన అలనాటి ప్రఖ్యాత తబాలా కళాకారుడు ఉస్తాద్‌ అల్లరఖా ఖాన్‌ కుమారుడు జాకీర్‌ హుస్సేన్‌. సంగీతంలో తండ్రి వారసత్వాన్ని అందుకుని తండ్రిని మించిన కొడుకుగా కీర్తి ఘడించారు. ఏడేళ్ల ప్రాయంలో తబాలాలో అరంగేట్రం చేసిన జాకీర్‌ హుస్సేన్‌ భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పొందారు. జాకీర్‌ హుస్సేన్‌ ఐదు గ్రామీ అవార్డులు పొందారు. వాటిలో ఈ ఏడాది 66వ గ్రామీ అవార్డుల్లో మూడు ఉండడం విశేషం. ఆరు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచంలో కొనసాగిన ఆయన 73వ యేటా కన్నుమూశారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్‌, 2023లో పద్మవిభూషణ్‌ పురస్కారాలు పొందారు. సంగీత నాటక అకాడమీ పురస్కారం కూడా లభించింది. 

భార్య గతంలోనే..
కాగా అతడి భార్య ఆంటనియో మిన్నెకోలా 1978లో కన్నుమూయగా.. జాకీర్‌ హుస్సేన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా జాకీర్‌ హుస్సేన్‌ అంత్యక్రియలు అమెరికాలోనే జరుగుతాయని కుటుంబసభ్యులు వెల్లడించారు. శాస్త్రీయ సంగీతానికి ఎనలేని సేవ చేసిన జాకీర్‌ హుస్సేన్‌ మృతిపై సంగీత కళాకారులు ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News