Rajamouli: దేవర సాంగ్ కి స్టెప్పులేసిన రాజమౌళి..ఆయనతో పోటీ పడుతూ..!

Devara Ayudha Pooja Song: దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన దర్శకత్వంతో ఎంతోమందిని మెప్పించారు. ముఖ్యంగా తన సినిమాలతో గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను దక్కించుకున్నారు రాజమౌళి.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Dec 16, 2024, 11:40 AM IST
Rajamouli: దేవర సాంగ్ కి స్టెప్పులేసిన రాజమౌళి..ఆయనతో పోటీ పడుతూ..!

Rajamouli Dance For Devara Song:రాజమౌళి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. శాంతినివాసం సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన రాజమౌళి,  ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేసి డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిన ఏ సినిమా కూడా ఆయనకు డిజాస్టర్ ను అందివ్వలేదు. 

ఇక అలా ప్రభాస్ తో బాహుబలి సినిమా చేసి పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు.  ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా చేసి ఏకంగా గ్లోబల్ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. రాజమౌళి. 

ఇకపోతే రాజమౌళిలో దర్శకుడు మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా ఉన్నాడన్న విషయం అప్పుడప్పుడు ఆయన నిరూపిస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే రాజమౌళి.. ఎన్టీఆర్ ఇటీవల నటించిన దేవర సినిమాలోని ఆయుధ పూజ పాటకు స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

ముఖ్యంగా కీరవాణి కొడుకు సింహ కోడూరి రిసెప్షన్లో డైరెక్టర్ రాజమౌళి దేవర సినిమాలోని ఆయుధ పూజ పాటకు అదిరిపోయే డాన్స్ చేయడంతో ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.ముఖ్యంగా కాలభైరవతో పోటీపడుతూ.. మరీ రాజమౌళి డాన్స్ చేయడం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

ఇకపోతే డైరెక్షన్ లోనే కాదు డాన్స్ లో కూడా నేనే నెంబర్ వన్ అని అనిపించుకున్నారు. ఇకపోతే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ఎస్ ఎస్ ఎమ్ బి 29 అని వర్కింగ్ టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News