Covid-19: మరో ఆరు హాట్ స్పాట్ లను గుర్తించిన ఢిల్లీ...

కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా మరో 6 కరోనా హాట్‌స్పాట్లను

Last Updated : Apr 17, 2020, 11:23 PM IST
Covid-19: మరో ఆరు హాట్ స్పాట్ లను గుర్తించిన ఢిల్లీ...

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా మరో 6 కరోనా హాట్‌స్పాట్లను గుర్తించినట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 66 కరోనా వైరస్ కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో వైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, లాక్‌డౌన్ నిబంధనలను ప్రజలంతా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాజిక దూరం పాటించి కరోనా నియంత్రణకు సహకరించాలని పోలీసులు కోరారు.  అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి.. వాట్సాప్‌లో పెళ్లి!

మరోవైపు దేశంలో ఇప్పటివరకు మొత్తం 3.32 లక్షల కొవిడ్-19 పరీక్షలు నిర్వహించామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది. శుక్రవారం ఒక్క రోజే 28,542 పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించింది. ఏప్రిల్ 17 నాటికి దేశవ్యాప్తంగా 3,15,964 మంది నుండి 3,32,583 నమూనాలు సేకరించి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించామని ఐసీఎంఆర్ ఓ ప్రకటనలో పేర్కొంది.

Also Read: కరెన్సీ నోట్లతో కరోనా వ్యాపిస్తుందా ?

కాగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 13,835కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి వైరస్ కారణంగా 452 మంది మరణించినట్లు తెలిపింది. సుమారుగా 1800 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారనీ.. ప్రస్తుతం 11,616 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని కేంద్రం పేర్కొంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News