/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశలో కలకలం రేపుతోంది. ఏప్రిల్ నెలలో దేశంలో కరోనా మహమ్మారి పలు రాష్ట్రాలలో పెను ప్రభావాన్ని చూపుతోంది. తెలంగాణలో తాజాగా 3,187 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,27,278కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ ఆదివారం(ఏప్రిల్ 11న) ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

తెలంగాణలో శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 వరకు గత 24 గంటల్లో 1,15,311 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో మూడు వేల నూట ఎనభై ఏడు మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా వైరస్(CoronaVirus) పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 27 వేల 278కు చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ మరో ఏడుగురు వ్యక్తులు మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,759కి చేరింది.

Also Read: Covid-19 Deaths: ఎండలకు, కరోనా మరణాలకు ఉన్న లింక్‌పై నిపుణులు తేల్చిన విషయం ఇదే

దేశంలో ఎన్నడూ లేని విధంగా గత కొన్ని రోజులుగా లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కన్నా అయిదు రెట్లు అధికంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ కరోనా భయాందోళన పెరుగుతోంది. గురువారం ఒక్కరోజు రాష్ట్రంలో చికిత్స అనంతరం కోవిడ్-19(COVID-19) నుంచి 787 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,05,335 మంది కరోనా మహమ్మారిని జయించారు. 

Also Read: Surgical face mask vs 5-layered mask: సర్జికల్ మాస్క్ vs N95 మాస్క్.. కరోనా నుంచి సేఫ్టీ కోసం ఏది బెటర్

తాజా కోవిడ్-19 పాజిటివ్ కేసులలో అధికంగా జీహెచ్ఎంసీలోనే నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోనే ఏకంగా 551 కరోనా కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 20,184 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 13,366 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ చేసిన కరోనా టెస్టుల సంఖ్య 1,09,88,976కు చేరింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Telangana Reports 3,187 New COVID-19 Positive Cases And Seven Deaths
News Source: 
Home Title: 

Telangana COVID-19 Cases: తెలంగాణలో తాజాగా 3000 దాటిన కరోనా పాజిటివ్ కేసులు

Telangana COVID-19 Cases: తెలంగాణలో తాజాగా 3000 దాటిన కరోనా పాజిటివ్ కేసులు
Caption: 
Corona Positive Cases In Telangana
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

కరోనా వైరస్ మహమ్మారి రెండో దశలో కలకలం రేపుతోంది

తెలంగాణలో తాజాగా 3,187 మంది కరోనా బారిన పడ్డారు

మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,27,278కు చేరింది

Mobile Title: 
Telangana COVID-19 Cases: తెలంగాణలో తాజాగా 3000 దాటిన కరోనా పాజిటివ్ కేసులు
Shankar Dukanam
Publish Later: 
No
Publish At: 
Sunday, April 11, 2021 - 10:13
Request Count: 
67
Is Breaking News: 
No