China New Airbase: ఇండో చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గకుండానే..చైనా మరో దుశ్చర్యకు పాల్పడింది. వివాదాస్పద లడాఖ్ ప్రాంతం సమీపంలో చైనా కొత్తగా ఎయిర్‌బేస్ అభివృద్ది చేస్తుండటం కొత్త వివాదానికి తావిస్తోంది.
ఇండియా-చైనా సరిహద్దు(Indo-china border) వద్ద లడాఖ్ ప్రాంతంలో రేగిన సరిహద్దు ఉద్రిక్తత ఇంకా తగ్గలేదు. కొత్తగా మరో వివాదం ప్రారంభమైంది.లడాఖ్(Ladakh) సమీపంలో చైనా దుశ్చర్యకు పాల్పడటమే దీనికి కారణం. లడాఖ్ సమీపంలోని షాక్చే వద్ద చైనా కొత్తగా ఎయిర్‌బేస్(New Airbase)అభివృద్ధి చేస్తున్నట్టు భారతీయ ఏజెన్సీలు గుర్తించాయి. ఈ ఎయిర్‌బేస్ నిర్మాణం పూర్తయితే లైన్ ఆఫ్ కంట్రోల్ పొడుగునా..చైనాకు వైమానిక మద్దతు భారీగా పెరగనుంది. షాక్చే ఎయిర్ బేస్‌ను పూర్తిగా మిలటరీ బేస్‌గా మార్చుతూ..ఫైటర్ ఆపరేటర్స్‌కు అనుకూలంగా రూపొందిస్తోంది.
చైనా ఇటువంటి చర్యలు ఎల్ఓసీ(LOC)వద్ద ఉద్రిక్తతల్ని మరింతగా పెంచుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. యుద్ధం సంభవిస్తే చైనా కంటే వేగంగా ఎల్ఓసీకు ఇండియా చేరుకోగలదనే వాస్తవాన్ని గుర్తించింది కాబట్టే..ఎయిర్‌బేస్ నిర్మాణం తలపెట్టిందని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది నుంచి సరిహద్దుకు సమీపంలో 7 చైనా ఎయిర్‌బేస్(China Airbase)లపై భారతీయ ఏజెన్సీలు కన్నేశాయి. ఇటీవలికాలంలో చైనా ఆ ఎయిర్‌బేస్‌లను మరింత అభివృద్ధి చేస్తోంది.
Also read: World Corona Update: ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎన్ని కరోనా వైరస్ కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook