Gandhi Hospital Gang Rape: మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా ప్రాంతానికి చెందిన వ్యక్తి కిడ్నీలు పాడవటంతో చికిత్స కోసం ఈ నెల 4 వ తేదీన గాంధీ ఆసుపత్రికి అతడి భార్య, మరదలు తీసుకొచ్చారు. అదే గాంధీ ఆసుపత్రిలో రేడియాలజీ (Radiologist) విభాగంలో అసిస్టెంట్‌గా పనిచేసే ఉమామహేశ్వర్ (Uma maheshwar) అనే వ్యక్తి వారికి దూరపు బంధువు కావటంతో అతని సహాయంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు, అయితే 7 వ తేదీ నుండి భార్య- మరదలు పేషంట్ ను చూడటానికి రాకపోవటంతో ఇంటి దగ్గర ఉన్న 17 ఏళ్ల కుమారుడికి కబురు పెట్టాడు. ఎంత వెతికినా వారి ఆచూకి లభించక పోవటంతో, 11 తేదీన తన తండ్రిని ఇంటికి తీసుకుల్లాడు. చివరకి ఆదివారం నాడు 17 ఏళ్ల కుమారుడుకి ఉమామహేశ్వర్ నుండి ఫోన్ రాగా.. "ఆసుపత్రి వెనుక ఖాళీ భాగంలో మీ పిన్ని బట్టలు లేకుండా పడి ఉందని" కబురందటంతో హుటాహుటిన చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న పిన్ని చూసి, తనకు సపర్యలు చేసి ఏం జరిగింది అని అడగ్గా.. తనపై జరిగిన అత్యాచారం గురించి తెలిపిందని అతడు వివరించాడు. ఇప్పటికీ రెండో బహాదితురాలు ఆచూకీ దొరక్కపోవటం గమనార్హం.
Also Read: Bigg Boss: బిగ్‌బాస్ లోకి తీసుకోలేదని రోడ్లపై ప్రముఖ నటి హల్‌చల్.. వైరల్ అవుతున్న వీడియో!
జాతీయ ఎస్సీ (NCSC) కమిషన్ ఆగ్రహం
గాంధీ ఆసుపత్రిలో (Gandhi Hospital) జరిగిన గ్యాంగ్ రేప్ పై జాతీయ ఎస్సీ కమిషన్ (National Commission for Scheduled Castes) ఆగ్రహానికి గురైంది. భాదితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయకపోవటం, రెండో భాదితురాలు ఆచూకీ ఇంత వరకి లభించకపోవంపై తెలంగాణ సీఎస్ (Telangana CS), డీజీపీ (DGP), హోంశాఖ కార్యదర్శి (Home Secretary), ఆరోగ్యశాఖ కార్యదర్శికి (Health Secretary) నోటీసులు జారీ చేయటమే కాకుండా వారిపై ఆగ్రహానికి గురైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook