Heavy rain lashes Tirumala Ghat Roads Closed Temporarily: తిరుమలలో కురుస్తున్న వర్షాలకు ఘాట్ రోడ్లో కొండచరియలు విరిగిపడిపోతున్నాయి. దీంతో గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 వరకు తిరుమల, తిరుపతి మధ్య ప్రయాణించే రెండు ఘాట్ రోడ్లలో (Ghat Roads) రాకపోకలు నిషేదించారు. ఈ విషయాన్ని టీటీడీ (TTD) భద్రతా విభాగం తెలిపింది. తిరుమలపై వాయుగుండం ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది.
Also Read :Man kiled by wife's boyfriend : ఇష్టం లేని పెళ్లి చేశారని ప్రియుడితో భర్తను చంపింది
నిన్న అర్ధరాత్రి నుంచి తిరుమలలో (Tirumala) భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. దీంతో తిరుమల కనుమదారులను మూసివేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది.
రెండో కనుమదారిలో 14వ కిలోమీటరు వద్ద, దిగువ ఘాట్ రోడ్లో రెండో మలుపులో రోడ్డుపై పెద్దపెద్ద బండరాళ్లు కూడా పడ్డాయి. జేసీబీల సాయంతో వాటిని తొలగించే పనులు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల (Heavy rains) కారణంగా తిరుమలకు ఆర్టీసీ బస్సు (RTC bus) సర్వీసులు నిలిపివేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే మళ్లీ బస్సు సర్వీసులు పునరుద్ధరించనున్నారు.
Also Read :Pakka Commercial : గోపీచంద్ పక్కా కమర్షియల్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook