Yadadri Road Accident: యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా... ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే...
యాదాద్రి భువనగిరి జిల్లాలోని (Yadadri Bhuvanagiri district) ఆలేరు బైపాస్ రోడ్డులో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ ప్రాంతంలో ట్రాక్టర్‌ను నిలిపి ఉంచారు. ఆ పక్కనే కూలీలు కూలీలు వర్క్ చేస్తున్నారు. ఆ సమయంలో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సు (RTC Bus) వెళ్తుంది. అయితే, వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టడంతో పాటు కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు అక్కడిక్కడే మృతి చెందారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆలేరు ఆస్పత్రికి తరలించారు. మృతులంతా భువనగిరి మండలం రాయగిరికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన కారణంగా జనగామ-హైదరాబాద్ రహదారిపై కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
Also Read: Kurnool: బస్సు సీట్ల కింద భారీ నగదు.. బనియన్లలో బంగారం.. స్వాధీనం చేసుకున్న అధికారులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook