Kritishetti in PSPK Movie: తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఉన్న క్రేజ్ అంతో ఇంతో కాదు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' మూవీ నుంచి మొదలుకొని మొన్నటి 'భీమ్లా నాయక్' వరకు ఫ్యాన్ ఫలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. మలయళంలోని సినిమా అయిన 'అయ్యప్పనుం కోషియుం' రిమెక్ 'భీమ్లానాయక్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను అలరించిన సంగతి అందరికి తెలిసిందే.
అయితే ఇప్పుడు పవన్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చిత్రీకరణ పూర్తీ చేసే పనిలో ఉన్నారు. త్వరలో హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న 'భవదీయుడు భగత్‌సింగ్' అనే మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే తెలుగు స్టార్ హీరో పవన్ మరో సినిమాకి కూడా ఓకే చెప్పినట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. తమిళంలో సూపర్ డుపర్ హిట్ అయిన 'వినోదయ చిత్తం' అనే చిత్రం రీమేక్‌లో నటిస్తున్నారని టాక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఈ మూవీ సముద్రఖని దర్శకత్వంలో తంబిరామయ్య కీలక పాత్రలో రూపొందిన ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. ఈ తరుణంలో పవర్ స్టార్ తో రీమేక్ చేయబోతున్నరని సమాచారం. అలాగే ఈ సినిమాలో తంబి రామయ్య పాత్రను తెలుగులో సాయిధరమ్ తేజ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఒక విధంగా ఈ మూవీ మల్టీస్టార్లు నటిస్తున్నందున సినీ బజ్‌లో మంచి టాక్.
ఉప్పెన సినిమాలో వైష్ణవ్‌తేజ్ జోడీగా నటించిన బ్యూటీ కృతిశెట్టిని ఎంపిక చేసుకున్నరని జోరుగా ప్రచారం జరుగుతోంది.అయితే ఈ మూవీ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రాబోతోంది. పవన్ కళ్యాణ్ టీమ్ వర్క్స్‌తో పాటు జీ స్డూడియోస్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. కానీ పవన్ తన రెమ్యూనరేషన్ కు బదులు ఈ సినిమాలో వాటా తీసుకోబోతున్నారని సినీ రంగంలో టాక్.
పవన్ తను నటించే ఒకో సినిమాకి రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. దాన్నే ఈ సినిమాకి పెట్టుబడిగా పెట్టారని జోరుగా టాక్స్ వినిపిస్తోంది. రీసెంట్ విడుదలైన 'భీమ్లానాయక్' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా కూడా భీమ్లానాయక్ లాగా హిట్ అవుతుందని సినీ వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి.
Also Read: Karnataka Hijab Row: హిజాబ్‌పై తీర్పు వెలువరించిన జడ్జిలకు 'వై' కేటగిరీ భద్రత..
Also Read: IPL 2022: సీఎస్‌కేకు మరో షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook