Kiran Abbavaram Talks about Nenu Meeku Baga Kavalsinavadini movie story: యువ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గీతా ఆర్ట్స్‌లో ‘వినరో భాగ్యము విష్ణు కథ’, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోచేస్తున్న ‘మీటర్’ సినిమాల చిత్రీకరణలు పూర్తయ్యాయి. ఎఎమ్ రత్నం నిర్మాణంలో ‘రూల్స్ రంజన్’ సినిమా చేస్తున్న కిరణ్.. శ్రీధర్ గాదె దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇక శ్రీధర్ గాదె దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాతగా రూపొందిన సినిమా 'నేను మీకు బాగా కావల్సినవాడిని'లో హీరోగా నటించాడు. ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 16)న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం బుధవారం విలేకర్లతో మాట్లాడి పలు విషయాలు పంచుకున్నారు.
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ... 'నా గత సినిమాలలో నేను రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేయలేదు. తొలిసారిగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాలో చేశాను. అందులో ఎనర్జిటిక్ మాస్ షెడ్ అయితే.. మరొకటి చాలా సెటిల్డ్‌గా ఉంటుంది. హీరోగా నిలదొక్కుకుంటున్న ఈ దశలో ఇలాంటి కథ నా దగ్గరికి రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా నా కెరీర్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ సినిమా ద్వారా మీ అందరికీ మరింత దగ్గరవుతా అనే నమ్మకం ఉంది' అని అన్నారు.
'నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాలో అన్ని అంశాలు ఉంటాయి. అభిమానులకు కన్నుల పండగలా ఉంటుంది. భావోద్వేగాలు, హాస్యం, పోరాటాలు అన్ని ఉంటాయి. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాయింట్‌ని చర్చించాం. సరికొత్త కథ అని చెప్పను కానీ.. మన అందరి ఇంట్లో జరిగే కథలా ఉంటుంది. ఈ చిత్రంలో మహిళల పాత్రలు చాలా కీలకం. ఈ చిత్రానికి నేనే మాటలు రాశాను. బాబా భాస్కర్, నా కాంబినేషన్ సన్నివేశాలు సరదాగా ఉంటాయి. ఎస్వీ కృష్ణారెడ్డి గారు తండ్రిగా ఆకటుట్కుటారు. మణిశర్మ గారి సంగీతం, నేపథ్య సంగీతం చాలా బాగుంది' అని కిరణ్ అబ్బవరం చెప్పాడు.
'డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. అమ్మోరు, అరుంధతి సినిమాలు చూసి నేను పెరిగాను. ఆయనతో పనిచేసే అవకాశం దక్కకపోయినా.. ఆయన కుమార్తె దివ్య దీప్తి గారితో పనిచేయడం ఆనందంగా ఉంది. నిజానికి ఎస్‌ఆర్ కల్యాణ మండపం సినిమాకి ముందే నేను మీకు బాగా కావాల్సినవాడిని ఓకే అయింది. అయితే కరోనా లాక్‌డౌన్ వల్ల సినిమా చాలా ఆలస్యం అయింది. దివ్య దీప్తి గారి సహకారం వల్లే ఈ సినిమా బాగా వచ్చింది' అని కిరణ్ చెప్పుకొచ్చారు.
Also Read: ఈరోజు నాకు పిచ్చెక్కిపోతుంది.. ఎలా కలవాలో అర్ధం కావడం లేదు: రష్మిక
Also Read: క్రికెట్‌లో విషాదం.. అంపైర్ అసద్ రౌఫ్ కన్నుమూత! విజయవంతమైన అంపైర్‌గా పేరు కానీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook