Telangana Rain Alert : తెలంగాణలో గత రెండు, మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షం కురుస్తుందని.. మిగితా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని తెలిపింది.ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్. నిజమాబాద్ జిల్లాలో మోస్తరు వర్ష సూచన చేయగా.. మిగితా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేసింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నైరుతి రుతుపవనాల తిరోగమనంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణపై రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. అటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.అత్యవసర పనులు ఉంటే తప్ప జనాలు బయటికి రావొద్దని సూచించింది.
బుదవారం కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. గురువారం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కుండపోత వానలు కురవనున్నాయి. శుక్రవారం నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.
Also Read : IND vs SA 1st T20I: తొలి టీ20కి భారీ ముప్పు.. మ్యాచ్ సజావుగా సాగడం కష్టమే!
Also Read : Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో కీలక నేత అనుచరుడు అరెస్ట్.. తెలంగాణలో కలకలం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి