Nagababu Birthday: మా చిన్నన్నయ్య ధృడంగా నిలబడే వ్యక్తి.. ఆయనకు ప్రత్యేక స్థానం: పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan Birthday Wishes To Nagababu: తన అన్నయ్య నాగబాబుకు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్ చెప్పారు. తనకు పుస్తకాలు పరిచయం చేసింది చిన్నన్నయేనంటూ జనసేనానిని గుర్తు చేసుకున్నారు. నాగబాబు గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2022, 12:57 PM IST
Nagababu Birthday: మా చిన్నన్నయ్య ధృడంగా నిలబడే వ్యక్తి.. ఆయనకు ప్రత్యేక స్థానం: పవన్ కళ్యాణ్‌

Pawan Kalyan Birthday Wishes To Nagababu: సినీ నటుడు, జనసేన పీఏసీ సభ్యులు నాగబాబుకు ఆయన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ బర్త్ డే విషెస్ చెప్పారు. తన జీవనయానంలో ఒక ప్రత్యేక స్థానం ఉన్న చిన్నన్నయ్య నాగబాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు. వర్తమాన రాజకీయ, సామాజిక అంశాలను విశ్లేషించుకొనేటప్పుడు.. వాటి తాలూకు నేపథ్యాలను,చారిత్రక కోణాలను వాస్తవిక దృక్పథంతో అవగాహనపరచుకోవడం గురించి తెలిజేయసింది నాగబాబు అని చెప్పారు.

'ప్రఖ్యాత న్యాయకోవిదులు నానీ పాల్కీవాలా ఔన్నత్యాన్ని, రాజ్యాంగం, మన న్యాయ వ్యవస్థ గురించి ఆయన రాసిన పుస్తకాలను నాకు పరిచయం నాగబాబు గారే. స్వతహాగా నాగబాబు గారు న్యాయవాది కావడంతో రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలు గురించిన అంశాలపై ఆసక్తి చూపేవారు. మానవ హక్కుల ఉల్లంఘన, పర్యావరణ విధ్వంసం లాంటివాటిపై ఎక్కువగా మాట్లాడేవారు. పీడిత వర్గాల బాధలకు చలించే తత్వం ఉంది. 

నెల్లూరులో చదువుకొనే రోజుల్లో చిన్నన్నయ్య మద్రాస్ హిగ్గిన్ బాథమ్స్ నుంచి తెచ్చిన '100 గ్రేట్ లైఫ్' అనే పుస్తకాన్ని ఇచ్చి తప్పకుండా చదవమన్నారు. అప్పటి నుంచి అనేక పుస్తకాలను, బాబాసాహెబ్ అంబేడ్కర్, వీర సావర్కర్, భగత్ సింగ్, టైగర్ జతిన్ దాస్, చిట్టగాంగ్ తిరుగుబాటుదారులు నుంచి జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి.. ఇలా మన సమాజాన్ని భిన్న కోణాల్లో ప్రభావితం చేసిన జీవిత గాథలను తెలిపే రచనలను, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఇచ్చారు. 

ముదిగొండ శివప్రసాద్ గారి చారిత్ర కల్పనా సాహిత్యం బాగా చదివేవారు. దానిపై చర్చించేవారు. గద్దర్ విప్లవ గీతాలు, కోడిబాయే లచ్చమ్మది... కోడిపుంజు బాయే లచ్చమ్మది లాంటి జానపదాల గురించి చెప్పేవారు. నాగబాబు గారిలో మంచి చిత్రకారుడు ఉన్నాడు. అలాగే చదువుకొనే రోజుల్లో కరాటే ప్రాక్టీస్ చేశారు. ఇప్పటికీ ఏదొక కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే తపిస్తారు. ప్రకృతి వైద్యంలో చెప్పిన అంశాలను పాటిస్తారు. 

తేనె, నిమ్మరసం తీసుకొంటూ రోజుల తరబడి ఉంటారు. నాస్తికవాదం, ఆస్తికత్వం.. ఏదైనా హేతుబద్ధంగా ఆలోచన చేయాలంటారు. ఇలా చిన్నన్నయ్యలో భిన్న పార్శ్వా లు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని ధృడంగా నిలబడే నాగబాబు అన్నయ్యకి ఈ జన్మదిన సందర్భంగా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ ప్రకృతి మాతను ప్రార్థిస్తున్నాను..' అంటూ పవన్ కళ్యాణ్ పేరు మీద జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

 

Also Read: EPFO Pension Rules: మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా పెన్షన్‌కు అర్హులే.. ఈ రూల్స్‌ తెలుసుకోండి  

Also Read: Munugode Bypoll: జేపీ నడ్డా మునుగోడు బహిరంగ సభ రద్దు! ఫాంహౌజ్ డీలే కారణమా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News