అమెజాన్‌పై ఇప్పుడు ఇంకా డిస్కౌంట్ ఆఫర్లు హల్‌చల్ చేస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లు కలిగిన 25 వేల శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కేవలం 3 వేలకే దక్కించుకునే అద్భుత అవకాశం. ఎలాగంటే..
Samsung Galaxy M33 5G ఓ అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్. అటు బ్యాటరీ కూడా మరెందులోనూ లేనివిధంగా 6000 ఎంఏహెచ్ సామర్ద్యాన్ని కలిగి ఉంది. ఇక కెమేరా అయితే ఏకంగా 50 మెగాపిక్సెల్ కలిగి ఉంది. ఇన్ని ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్ కూడా భారీగానే ఉంది. సగం కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. మార్కెట్‌లో మిడ్ రేంజ్ ప్రోడక్ట్‌లో ట్రెండ్ అవుతున్న ఫోన్ ఇది. భారీ డిస్కౌంట్ ఉండటంతో అందరూ కొనుగోలు చేసుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం 33 స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ 24,999 రూపాయలకు లిస్ట్ చేసింది. కానీ కస్టమర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌పై 22 వేల రూపాయలు సేవ్ చేయవచ్చు. ఎందుకంటే అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై 8 వేల రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది. అంటే ఈ ఫోన్ 16000 కు లభ్యం కానుంది. ఇక ఎక్స్చేంజ్ ధర 14,050 రూపాయలుంది. ఒకవేళ మీకు ఎక్స్చేంజ్ ధర పూర్తిగా వర్తిస్తే ఈ స్మార్ట్‌ఫోన్ మీకు కేవలం 2,949 రూపాయలకే లభిస్తుంది. ఎక్స్చేంజ్ ధర ఎంత వర్తిస్తుందనేది మీ పాత ఫోన్ కండీషన్, మోడల్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది.
Samsung Galaxy M33 5G ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. 6.6 ఇంచెస్ పుల్ హెచ్‌డి ప్లస్ ఇన్‌ఫినిటీ వీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ , గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మరో ప్రత్యేకత. ర్యామ్ 8 జీబీ కావడంతో పనితీరు చాలా వేగంగా ఉంటుంది. శాంసంగ్‌కు చెందిన రామ్ ప్లస్ ఫీచర్ సహాయంతో..ర్యామ్‌ను 16 జీబీకు పెంచుకోవచ్చు. మరో ప్రత్యేకత దీని బ్యాటరీ. ఏ ఇతర స్మార్ట్‌ఫోన్‌లో లేనివిధంగా 6000 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంది. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
Samsung Galaxy M33 5G కెమేరా
ఈ స్మార్ట్‌పోన్‌లో క్వాడ్ రేర్ కెమేరా సెటప్ ఉంది. ఇందులో f/1.8 యాపెర్చర్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, f/2.4 యాపెర్చర్ 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, f/2.2 యాపెర్చర్ 2MP మైక్రో షూటర్, f/2.2 యాపెర్చర్ 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇందులో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ మరో ప్రత్యేకత.
Also read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... దిగొచ్చిన బంగారం, వెండి ధరలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook