Kolkata Knight Riders buy Shardul Thakur from Delhi Capitals via trade: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 మరో 4 నెలల్లో మొదలుకానుంది. ఐపీఎల్ 2023 వేలం 2022 డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. వేలంకు సమయం ఆసనమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ట్రేడింగ్ విధానం జరుగుతోంది. దాంతో అన్ని జట్లు ముఖ్యమైన ఆటగాళ్లను అట్టిపెట్టుకుని, మిగతావాళ్లను వదులుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కీలక ఆటగాడిని జట్టులో చేర్చుకుంది. ట్రేడ్ విధానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టు నుంచి శార్థూల్ ఠాకూర్‌ని కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2022 వేలంలో శార్థూల్ ఠాకూర్‌ని రూ.10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అయితే ఠాకూర్ ఆశించినంతగా రాణించలేదు. 14 మ్యాచుల్లో 120 పరుగులు మాత్రమే తీశాడు. మరోవైపు బౌలింగ్‌లో 9.79 సగటుతో 15 వికెట్లు తీశాడు. దాంతో డిల్లీ జట్టు ఠాకూర్‌ని వదులుకుంది. శార్థూల్‌ని అమ్మేయడంతో ఢిల్లీ మూడో విడత ట్రేడ్ ఒప్పందాన్ని పూర్తి చేసుకుంది. శార్థూల్ ఇదివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఆడి భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ట్రేడ్ ఒప్పందంలో భాగంగా శార్థూల్ ఠాకూర్‌తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్ నుంచి ఆల్‌రౌండర్ ల్యూక్ ఫెర్గూసన్, వికెట్ కీపర్ రహమనుల్లా గుర్బాజ్‌లను తీసుకుంది. ఇంగ్లండ్ హిట్టర్ సామ్ బిల్లింగ్స్ ఐపీఎల్ 2023 నుంచి వైదొలిగాడు. దాంతో అతడి స్థానంలో గుర్బాజ్‌ను జట్టులోకి తీసుకుంది. ట్రేడ్ విధానంకు నవంబర్ 15వ ఆఖరు తేదీ కావడంతో.. అన్ని జట్లు ఇప్పటికే కొందరు ఆటగాళ్లను ఇతర జట్లకు అమ్మేశాయి.
Also Read: అందాల కంచె దాటేసిన ప్రగ్యా జైస్వాల్.. స్లీవ్ లెస్ డ్రెస్‌లో క్లీవేజ్ షో! పిక్స్ వైరల్
Also Read: Apsara Rani Pics: రెడ్ డ్రెస్‌లో హాట్ ట్రీట్.. అప్సర రాణి అందాలు చూడతరమా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి