New Head Coach For Team India in T20 format: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌లోనే ఓటమిబాట పడ్డడంతో బీసీసీఐ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవలె సెలక్షన్ కమిటీపై వేటు వేసిన బీసీసీఐ.. త్వరలో కీలక నిర్ణయాలు ఉంటాయని ముందే హింట్ ఇచ్చింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మను టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్స్ కూడా వచ్చాయి. తాజాగా బంగ్లా టూర్‌లో ఉన్న భారత్ తొలి వన్డేలో ఓడిపోయింది. బుధవారం రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోతే.. రోహిత్ శర్మ తీవ్ర విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఇక త్వరలోనే టీ20 ఫార్మాట్‌కు కొత్త కోచ్‌ను ఎంపిక చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం బయటకు వచ్చింది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ ఉన్నారు. ద్రావిడ్‌ను వన్డే, టెస్టులకు పరిమితం చేసి కొత్త కోచ్‌ను నియమించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. జనవరిలో శ్రీలంక టూర్‌కు టీమిండియా వెళ్లనున్న నేపథ్యంలో ఆలోపు నూతన కోచ్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
శ్రీలంక టూర్‌కు కొత్త కోచ్‌తో పాటు కొత్త కెప్టెన్‌ను కూడా ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ నుంచి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పగ్గాలను స్వీకరిస్తాడని ప్రచారం జరుగుతున్నా.. రాహుల్ ద్రవిడ్ స్థానంలో ఎవరు వస్తారనేది సస్పెన్స్‌గా మారింది. జనవరిలో శ్రీలంకతో భారత్ సిరీస్‌కు కోచ్, కెప్టెన్‌ను మార్చడంతో పాటు ఈ నెలలోనే కొత్త సెలక్షన్ కమిటీని నియమించే అవకాశం కనిపిస్తోంది.
రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి తక్కువ కాలమే అయినా.. ఆసియ కప్‌లో ఓటమి, టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో పది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవడంతో విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మను తొలగించాలని అభిమానులు డిమాండ్ చేశారు. సునీల్ గవాస్కర్, హర్భజన్ సింగ్, రవిశాస్త్రి వంటి మాజీలు సీనియర్లను పక్కనపెట్టి.. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కూడా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది.
Also Read: Ind Vs Ban: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఊహించని నిర్ణయం.. టీమిండియా నుంచి ఆ ఇద్దరు ఔట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి