Income Tax: ఐటీఆర్ ఫైల్ చేయడం మర్చిపోతే ఇలా చేయండి.. లాస్ట్ ఛాన్స్ ఉంది

Income Tax Notice: ఆదాయపన్ను పరిధిలోకి వచ్చేవారు కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు గడువు తేదీ ముంచుకొస్తున్నా.. వాయిదా వేస్తూ చివరికి మర్చిపోతారు. మీరు లైట్ తీసుకుంటే.. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఊరుకోదు. నోటీసులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2023, 10:29 AM IST
Income Tax: ఐటీఆర్ ఫైల్ చేయడం మర్చిపోతే ఇలా చేయండి.. లాస్ట్ ఛాన్స్ ఉంది

Income Tax Notice: ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో ట్యాక్స్ పేయర్లు తమ ఆదాయ లెక్కల జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు. ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వారు కచ్చితంగా ఆదాయ పన్ను వివరాలను దాఖలు చేయాల్సి ఉంటుంది. సంపాదించే ప్రతి రూపాయిలో ఎంత ఖర్చు అవుతుందనే వివరాలను ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు అందజేయాలి. ఆదాయపు పన్ను రిటర్న్‌ని పూరించడం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు అనవసరమైన చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకోకుండా ఉంటారు. అదేవిధంగా లోన్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.

అయితే ఐటీఆర్ ఫైల్ చేయడం మర్చిపోయే వాళ్లకు కూడా కొదవలేదు. చాలామంది ఇంకా టైమ్‌ ఉంది కదా.. లాస్ట్‌లో ఫైల్ చేద్దామనుకుంటూ వాయిదా వేస్తూ.. వేస్తూ.. చివరి గడువు దాటిపోయిన తరువాత అయ్యో ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తారు. ఇలా వాయిదాలు వేయకుండా లాస్ట్‌ డేట్ కంటే ముందే ఐటీఆర్ ఫైల్ చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. 

మీరు కూడా నిర్ణీత గడువులోపు ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయకపోతే.. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ నుంచి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 142 కింద నోటీసు పంపించే అవకాశం ఉంటుంది. ట్యాక్స్ పరిధిలోకి వచ్చి ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే నోటీసును చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. డిపార్ట్‌మెంట్ నుంచి రిమైండర్ ఇది. తప్పును సరిదిద్దమని ఐటీఆర్ ఫైల్ చేయనివాళ్లకు గుర్తు చేయడానికి పంపిస్తారు. ఈ నోటీసును లైట్ తీసుకోకుంటే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. 

ఇప్పుడు ఆలస్యమైన రిటర్న్‌ను ఫైల్ చేసే అవకాశం మిస్ అయితే ఏం చేయాలని చాలామంది ఆలోచిస్తున్నారు. ఫైనాన్స్ యాక్ట్ 2022 కొత్త ఐటీర్ ఫైల్ చేసే సదుపాయాన్ని అందించింది. దీనికి అప్‌డేటెడ్ రిటర్న్ (ఐటీఆర్-యూ) అని పేరు పెట్టారు. ఇందుకోసం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139కి కొత్త సబ్ సెక్షన్ 8(ఎ) జోడించింది. మీ పాత ఐటీఆర్‌లో ఏదైనా పొరపాటు ఉంటే లేదా మీరు చూపించడం మర్చిపోయినా.. ఏదైనా ఆదాయం ఉంటే మీరు అప్‌డేట్ చేసిన రిటర్న్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇది కాకుండా.. మీరు ఇంతకుముందు రిటర్న్ దాఖలు చేయకపోయినా.. మీరు అప్‌డేట్‌ రిటర్న్‌ను కూడా ఉపయోగించవచ్చు. సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాల వరకు అప్‌డేట్ చేసిన రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు.

అయితే ఇందుకోసం ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన 12 నెలలలోపు అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేసినట్లయితే ట్యాక్స్, వడ్డీలో 25 శాతానికి సమానమైన అదనపు పన్ను చెల్లించాలి. అదేవిధంగా 12 నెలల తరువాత, 2 సంవత్సరాల ముందు అప్‌డేట్ చేసిన రిటర్న్‌లను దాఖలు చేయడానికి 50 శాతం అదనపు పన్ను చెల్లించాలి. ఇది కాకుండా ఆలస్య రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకసారి మాత్రమే అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేస్తున్నప్పుడు.. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్‌ వివరాలను విడిచిపెట్టకూడదని గుర్తుంచుకోండి. మీరు ఏదైనా ఆదాయాన్ని చూపించడం మర్చిపోతే.. మీకు మళ్లీ అప్‌డేట్ చేసిన రిటర్న్‌ను ఫైల్ చేసే అవకాశం ఉండదు. ఐటీఆర్ యూ ఫైల్ చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోండి.

Also Read: Holi 2023: హోలీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. నిరుద్యోగ భృతి ప్రకటన   

Also Read: Twitter: ట్విట్టర్‌లో కీలక మార్పు.. ట్వీట్ లిమిట్ పెంచుతూ ఎలాన్ మస్క్ ప్రకటన  
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News