Side Effects Of Drinking Too Much Water: మంచి నీరు ఎంత ఎక్కువ తాగితే శరీరానికి అంత మంచిది అనే మాట మనం తరచుగా వింటుంటాం. మండు వేసవిలో నీరు ఎక్కువగా తాగకపోతే శరీరం డిహైడ్రేషన్ కి గురై అనారోగ్యం బారినపడుతారనే మాట కూడా వింటుంటాం. అయితే, నీరు ఎక్కువగా తాగడం కూడా ఆరోగ్యానికి ప్రమాదమే అనే విషయం తెలుసా ? అవును.. తరచుగా నీరు తాగడం ఆరోగ్యరీత్యా మంచి అలవాటే అయినప్పటికీ.. మరీ శృతిమించి అదే పనిగా నీరు తాగితే మాత్రం అది అనారోగ్యానికి దారితీస్తుందంటున్నారు హెల్త్ కేర్ ఎక్స్‌పర్ట్స్. నీరు అధికంగా తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటి ? ఆరోగ్య సమస్యలు ఏంటనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి జీవితంలో నీటికి ఉన్న ప్రాధాన్యత గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. నీరు ఉంటేనే మనిషి ఉంటాడు. నీరు లేకపోతే మనిషి కూడా లేనట్టే. ఎందుకంటే మనిషి శరీరంలోని అవయవాలు, జీవ కణాలు, టిష్యులు.. ఇలా శరీరంలోని అన్ని భాగాలకు కచ్చితంగా నీరు కావాల్సిందే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని విధాల పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారు ఎక్కువగా నీరు తాగితే పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు కానీ సాధారణ వ్యక్తులు అధిక మొత్తంలో నీరు తాగితే.. ఆ నీటిని అంతే వేగంగా బయటికి పంపించే శక్తి కిడ్నీలకు ఉండదు. కొన్నిసార్లు రక్తంలో ఉండే సోడియం డైల్యూట్ అవడం జరుగుతుంది. అదే కానీ జరిగితే అది ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది.
రోజుకు ఒక వ్యక్తి ఎన్ని నీళ్లు తాగొచ్చు ?
వాస్తవానికి ఒక వ్యక్తికి రోజు ఎన్ని నీళ్లు తాగొచ్చు అనే విషయంలో కచ్చితమైన ప్రమాణాలు ఏవీ లేవు. అయితే, వారు చేసే పనులు, వారికి కలిగే శారీరక శ్రమతో పాటు వారి శరీర బరువు లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అన్నింటికిమించి ఒక వ్యక్తి ఎన్ని నీళ్లు తాగొచ్చు అనే విషయంలో ఎప్పటికప్పుడు ఉండే వాతావరణం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
ఇదే విషయమై బిఎల్కే - మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో యూరాలజీ, యూరో అంకాలజీ విభాగం అసోసియేట్ డైరెక్టర్ డా యజ్వెంద్ర ప్రతాప్ సింగ్ రానా మాట్లాడుతూ.. " మామూలుగా అయితే సాధారణ రోజుల్లో ఒక వ్యక్తి రోజుకు కనీసం 3 లీటర్ల వరకు నీరు తాగితే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఒకవేళ వేసవి సీజన్ అయితే.. రోజుకు కనీసం 3.5 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది" అని తెలిపారు.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు హోమ్ రెమెడిస్, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. ఎవరి ఆరోగ్య సమస్య విషయంలో వారికి అనేక వేర్వేరు కారణాలు ఉంటుంటాయి కనుక ఈ సమాచారాన్ని పరిష్కారంగా భావించడానికి ముందుగా తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని ZEE NEWS ధృవీకరించడం లేదనే విషయాన్ని గ్రహించాల్సిందిగా మనవి.)
ఇది కూడా చదవండి : Heart Attack Reasons: ఆందోళన కల్గిస్తున్న ఆకస్మిక గుండెపోట్లు, ఎలాంటి జాగ్రత్తలు అవసరం
ఇది కూడా చదవండి : How To Control Diabetes: ఈ గుజ్జుతో 2 రోజుల్లో మధుమేహం దిగి రావడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK
Side Effects Of Drinking Too Much Water: నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలపై చెడు ప్రభావం చూపిస్తుందా ?`