Chicken Rain Viral Video: ఆకాశం నుంచి కోళ్ల వర్షం.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు.. చూడండి!

Chicken Rain Viral Video: సోషల్ మీడియాలో కోళ్లకు వర్షానికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో విపరీతంగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియోలో ఏం ఉందో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 4, 2025, 05:20 PM IST
Chicken Rain Viral Video: ఆకాశం నుంచి కోళ్ల వర్షం.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు.. చూడండి!

 Chicken Rain Viral Video Watch: సోషల్ మీడియాలో వింత వింత వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. ఇందులో జంతువులు, కోళ్లు, పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి. నెటిజన్స్‌ ఎక్కువగా వీటిని చూసేందుకే ఇష్టపడుతున్నారు. అందుకే జంతువులు, ఫ్యాన్నీ వీడియోలు షేర్‌ చేసిన వెంటనే లక్షల్లో వ్యూస్‌ వస్తున్నాయి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలే ఎక్కువగా ట్రెండ్‌ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో అందరినీ అశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఇంత వైరల్‌ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 
 
 
 
 

ఎక్కడైనా ఆకశం నుంచి వర్షం రావడం చూసి ఉంటాం.. కానీ ఈ వీడియోలో విచిత్రంగా బ్రతికున్న కోళ్లు పడుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో వివరాల్లోకి వెళితే.. ఈ వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక రోడ్డుపై వర్షంతో పాటు ఆకాశం నుంచి బ్రతికున్న కోళ్లు విచ్చల విడిగా పడుతున్నాయి. అంతేకాకుండా ఈ కోళ్లు రోడ్డుపై అటు ఇటు పరిగెత్తడం మీరు గమనించవచ్చు. 

ఇంత వరకు చాలా మంది ఆకాశం నుంచి చెపలు పడడం చూసి ఉంటారు. కానీ ఇక్కడ దాని భిన్నంగా ఆకాశం నుంచి నేరుగా వర్షం రూపంలో కోళ్లు పడుతుండడం నెటిజన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాకుండా కోళ్లు ఇలా ఎలా పడతాయని నెటిజన్స్‌ కామెంట్స్ రూపంలో ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరల్‌ అవుతున్న వీడియోను @majidposhtvan అనే ఇస్టా ఖాతా నుంచి షేర్‌ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 465,901 పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది.

 ఇక ఈ వీడియో కింద ఉన్న కామెంట్స్‌ పరిశీలించి చూస్తే.. కొంతమంది నెటిజన్స్‌ "ఇది నిజమా" అని అంటున్నారు. మరికొంతమందైతే.. ఇది ఎడిటింగ్‌ చేసిన వీడియో అని.. కేవలం సోషల్ మీడియాలో లైక్‌ల కోసం దీనిని షేర్‌ చేశారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం నిజం కాదు.. ఎవరో కావాలని ఈ వీడియోను ఎడిటింగ్ చేసి పోస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి :: King Cobra Shed Video: 5 అడుగుల కింగ్‌ కోబ్రా కుబుసాన్ని తొలిచేసిన యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

  

Trending News