Rat Bathing Viral Video Watch Now Here: సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగినప్పటి నుంచి ఎలాంటి వీడియోలు పడితే.. అలాంటి వీడియోలు ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అనుకోకుండా పోస్ట్ చేసిన వీడియోలైతే.. ఎక్కువగా ట్రెండ్ అవుతూ లక్షల్లో కోట్లలో సంపాదించుకుంటాయి. ఇలా ప్రతిరోజు కొన్ని లక్షలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. సాధారణంగా ప్రతిరోజు జంతువులు, కొన్ని ఫన్నీ వీడియోస్ వైరల్ అవుతే.. అప్పుడప్పుడు మాత్రం కొన్ని సీసీ టీవీలో బంధించిన సంఘటనలు నెట్టింట్లో చెక్కర్లు కొడుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువుల వీడియోల విషయానికొస్తే.. ఇవి షేర్ చేసిన సెకండ్ వ్యవధిలోనే ఖండాలను దాటి రీచ్ అవుతాయి. దీన్నిబట్టి చూస్తే.. సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు చూసే వారి సంఖ్య ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే ఇలాంటి వీడియోనే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా పడి పడి నవ్వుకుంటున్నారు.
సాధారణంగా అన్ని జంతువులు ఏదో ఒక టాలెంట్ ని కలిగి ఉంటాయి. కొన్ని జంతువులు వేటాడడంలో తమ టాలెంట్ ని చూపెడితే మరికొన్ని జంతువులు అయితే వాటిని రక్షించుకోవడంలో వాటి టాలెంట్ను అవి చూయించుకుంటాయి. అయితే ఇటీవల ఎలుక కూడా తన టాలెంట్ ని చూపించుకుంది.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. వీడియో వివరాల్లోకి వెళితే... ఓ ఎలుక స్వయంగా తనకు తాను శరీరమంతా సబ్బు రాసుకొని స్నానం చేయడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఆ ఎలుక మనిషి ఎలాగైతే స్నానం చేస్తాడు అలాగే అచ్చం వీపు వెన్ను భాగంలో సబ్బు రాసుకోవడం మీరు గమనించవచ్చు. నిజానికి ఎలుకలు ఇలా చాలా అరుదుగా చేస్తూ ఉంటాయి.
చాలామంది పెంపుడు జంతువులుగా ఎలుకలను కూడా పెంచుకుంటున్నారు. వాటికి మంచి ట్రైనింగ్ ఇచ్చి.. ఇంట్లో వివిధ రకాల పనులను కూడా అలవాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఎలుకకు వారి యజమాని స్నానం చేయడంలో ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఎలుక ఎవరి సహాయం లేకుండా తనంతట తాను సబ్బు రాసుకుంటూ స్నానం స్నానం చేస్తోంది. నిజానికి కొన్ని కొన్ని పెంచుకున్న ఎలుకలు కూడా ఇలా స్నానం చేయవు.
అయితే ఈ ఎలుక స్నానం చేయడం చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంట్లో వస్తువులను పాడు చేసే ఎలుకలే ఇలా ఎవరి సహాయం లేకుండా స్నానం చేయడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు దానిని మెచ్చుకుంటున్నారు. కొంతమంది ఈ వీడియోను చూసి కామెంట్లు కూడా చేస్తున్నారు.. "ఈ ఎలుక మనుషుల కంటే చాలా బెటర్ అని.. కొంతమంది స్నానం చేయకుండా విచ్చలవిడిగా తిరుగుతారని.. ఈ ఎలుక మాత్రం స్నానం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని" అంటున్నారు.. ప్రస్తుతం ఈ ఎలుకకు సంబంధించిన వీడియో ఓ ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు ఒక కోటికి పైగా మంది వీక్షించినట్లు తెలుస్తోంది. అలాగే మూడు మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి :: King Cobra Shed Video: 5 అడుగుల కింగ్ కోబ్రా కుబుసాన్ని తొలిచేసిన యువకుడు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.