Tortoise Ring Rules: తాబేలు ఉంగరం పెట్టుకోవచ్చా.? ఏ రాశి వారు ధరిస్తే రాజయోగం పడుతుంది..?

Astrology Tips For Tortoise Ring: ప్రస్తుతకాలంలో చాలా మంది తాబేలు ఉంగరాన్ని ధరిస్తున్నారు. ఇది ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల కలిగే లాభాలు, ఎవరు ధరించవచ్చు, ఎలా ఈ ఉంగరాన్ని ధరించాలి అనే వివరాలు తెలుసుకుందాం. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Dec 8, 2024, 11:23 PM IST
Tortoise Ring Rules: తాబేలు ఉంగరం పెట్టుకోవచ్చా.? ఏ రాశి వారు ధరిస్తే రాజయోగం పడుతుంది..?

Astrology Tips For Tortoise Ring: ప్రస్తుత కాలంలో తాబేలు ఉంగరాలు చాలా మంది ధరిస్తున్నారు. మార్కెట్‌లో తాబేలు ఉంగరాలకు ఎక్కువ డిమాండ్‌ కూడా ఉందని. అలాగే తాబేలు డిజైన్లు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండటం వల్ల చాలా మంది దీన్ని ఒక ఫ్యాషన్ ఆభరణంగా ధరిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, తాబేలు ఉంగరం ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, సహనం, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం వంటి గుణాలు పెరుగుతాయని నమ్ముతారు. అయితే ఈ తాబేలు ఉంగరాన్ని ప్రతిఒక్కరు ధరించవచ్చా..? దీని ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి? ఎలా ధరించాలి? ఎవరు ధరించ కూడదు అనే వివరాలు తెలుసుకుందాం. 

తాబేలు ఉంగరాని లక్ష్మీదేవితో ప్రత్యక్షమైన సంబంధం ఉందని కూడా నమ్ముతారు. ఈ ఉంగరాన్ని ధరించిన వ్యక్తికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తాబేలు ఉంగరం ధరించడం వల్ల ధనవంతులుగా మారుతారని చాలా మంది నమ్ముతారు.  జ్యోతిష్యం ప్రకారం సౌకర్యం లేని లేదా డబ్బు లేని వ్యక్తులు తాబేలు ఉంగరాన్ని ధరించిన వల్ల ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు చెబుతున్నారు. తాబేలు విష్ణువు అవతారం. దీని ధరించడం వల్ల  పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నిపుణులు అంటున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఉంగరాన్ని మేషరాశి,  కర్కాటక రాశి , వృశ్చిక రాశి,  మీన రాశి వ్యక్తులు ధరించకూడదు. ఎందుకంటే ఈ రాశి వారు ఎలాంటి సలహా లేకుండా తాబేలు ఉంగరాన్ని ధరిస్తే ఆ గ్రహం అపరాధానికి గురవుతుందని చెబుతున్నారు.  మిగతా రాశులవారు ఎలా ధరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఉంగరాన్ని కొనుగోలు చేయడానికి శుక్రవారం అత్యంత పవిత్రమైన రోజుగా నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శుక్రవారం రోజున ఈ ఉంగరాన్ని కొని ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి  ముందు ఉంచాలి ఆ తర్వాత ఉంగరాన్ని పాలతో అభిషేకం చేసి చివర్లో అగర్బత్తితో ధూపం చూపించాలి. ఈ ఉంగరాన్ని ధరించే ముందు లక్ష్మీదేవి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. 

 తాబేలు ఉంగరాన్ని ఏ వేలుకు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం:

తాబేలు ఉంగరాన్ని ధరించేటప్పుడు దాన్ని ముఖం ఎల్లప్పుడూ కూడా మన వైపుగా ఉండాలని గుర్తించుకోవాలి. దీని వల్ల డబ్బులు ఆకర్షిస్తుంది. మొఖం బయటకు ఉంటే డబ్బు రావడానికి బదులు డబ్బు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఉంగరాన్ని ఎల్లప్పుడూ కూడా కుడి చేతి మధ్య వేలుకు లేదా చూపుడువేలుకు ధరించాలి. ఈ ఉంగరాన్ని వెండితో తయారు చేయించుకుంటే మంచిది.

Also Read: Ram Gopal Verma: నా అరెస్ట్‌పై మీకు ఎందుకు తొందర.. కేసులపై న్యాయ పోరాటం చేస్తా'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News