Rama Ekadashi 2022: ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని రమా ఏకాదశి లేదా రామ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి (Rama Ekadashi 2022) నాడు విష్ణుమూర్తిని (Lord Vishnu) పూజిస్తారు. దీపావళి ముందు ఈ ఏకాదశి వస్తుండటంతో దీనికి ప్రాధాన్యత మరింత పెరిగింది. రమా ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీహరిని ఆరాధించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.
అదృష్టం, ఆరోగ్యం కోసం ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది రమా ఏకాదశి అక్టోబర్ 21, శుక్రవారం నాడు వస్తుంది. ఏకాదశి ఉపవాసాన్ని ద్వాదశి తిథి (అక్టోబరు 22) నాడు లేదా ఈ తిథి ముగిసేలోపు విరమించాలి, లేకుంటే మీ పూజకు ఫలితం ఉండదు. వ్రత పారణ సమయం అక్టోబరు 22 ఉదయం 06.30 నుండి 08.45 వరకు. ద్వాదశి తిథి ముగింపు సమయం సాయంత్రం 06.02 వరకు ఉంటుంది.
రమా ఏకాదశి ప్రాముఖ్యత
ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించిన వారికి పాపాల నుండి విముక్తి లభిస్తుందని అంటారు. అంతేకాకుండా అతడు మరణానంతరం విష్ణులోకంలో స్థానాన్ని పొందుతాడు. ఈ రోజున లక్షీదేవిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. దీంతో మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ ఏకాదశి నాడు సాయంత్రం దీప దానం చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి సంతోషిస్తుంది. దీంతో మీకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టఐశ్వర్యాలు సిద్దిస్తాయి.
Also Read: Dhanteras 2022: ఈ ఏడాది ధనత్రయోదశి ఎప్పుడు, ఈరోజున యమ దీపం ఎందుకు వెలిగిస్తారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook