SRH vs KKR Live Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ నిలువరించేనా, మోర్గాన్ సేనపై ఒత్తిడి

IPL 2021 SRH vs KKR Live Updates: కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. చెన్నై వేదికగా రాత్రి 7 గంటలక్ టాస్ వేయగా, ఏడున్నర గంటలకు మ్యా్చ్ ప్రారంభం కానుంది. గత సీజన్‌లో గాయాలు బాధించినా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరి సత్తా చాటింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 11, 2021, 02:58 PM IST
  • ప్రత్యర్థి జట్లకు షాక్‌లు ఇచ్చే జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి
  • చెన్నై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనున్న సన్‌రైజర్స్
  • ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది
SRH vs KKR Live Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ నిలువరించేనా, మోర్గాన్ సేనపై ఒత్తిడి

IPL 2021 SRH vs KKR Live Updates: ప్రతి ఏడాది ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగుతూ ప్రత్యర్థి జట్లకు షాక్‌లు ఇచ్చే జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు తమ తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. చెన్నై వేదికగా రాత్రి 7 గంటలక్ టాస్ వేయగా, ఏడున్నర గంటలకు మ్యా్చ్ ప్రారంభం కానుంది. గత సీజన్‌లో గాయాలు బాధించినా సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరి సత్తా చాటింది.

మరోవైపు గత సీజన్‌లోనే దినేష్ కార్తీక్ నుంచి ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నాడు. ఈ ఏడాది కేకేఆర్‌కు ఐపీఎల్ 2021 టైటిల్ అందించాలని మోర్గాన్ ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే ఇంగ్లాండ్ జట్టుకు అందని ద్రాక్షగా మారిన వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను తక్కువగా అంచనా వేయలేం. మరోవైపు గత సీజన్‌లో గాయంతో దూరమైన కీలక పేసర్ భువనేశ్వర్ కుమార్ జట్టుతో చేరడం సన్‌రైజర్స్(Sunrisers Hyderabad)‌కు ప్లస్ పాయింట్. భువీకి యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్, స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్ అటాక్ తోడైతే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు.

Also Read: MS Dhoni Fined: ఐపీఎల్ 2021 తొలి మ్యాచ్‌లో ఓడిన CSK కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జరిమానా

కెప్టెన్ డేవిడ్ వార్నర్, మనీష్ పాండే, జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్‌లతో టాపార్డర్ పటిష్టంగా ఉంది. ఓవరాల్‌గా 12-7తో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆధిక్యంలో ఉండగా, గత సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ సన్‌రైజర్స్ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం కలిసొచ్చే అంశం. ఆదివారం రాత్రి 7:30 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో, డిస్నీ + హాట్‌స్టార్‌లో మరియు జియో టీవీలో ఐపీఎల్ 2021(IPL 2021) మ్యాచ్‌లను వీక్షించవచ్చు.

Also Read: IPL 2021 Funny Memes: ఐపీఎల్ 2021పై వైరల్ అవుతున్న మీమ్స్, జోక్స్ మీకోసం 

సన్‌రైజర్స్ హైదరాబాద్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), కేన్ విలియమ్సన్, జానీ బెయిర్‌స్టో (కీపర్), మనీష్ పాండే, శ్రీవాత్స గోస్వామి (కీపర్), సాహా (కీపర్), కేదార్ జాదవ్, ప్రియమ్ గార్గ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, విరాట్ సింగ్, మిచెల్ మార్ష్, జాసన్ హోల్డర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్, బాసిల్ తంపి, జగదీషా సుచిత్, ముజీబుర్ రెహ్మాన్

కోల్‌కతా నైట్ రైడర్స్ : శుబ్‌మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, కరుణ్ నాయర్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), నితీష్ రానా, గురుకీరత్ మన్ సింగ్, టిమ్ సీఫెర్ట్, దినేష్ కార్తీక్ (కీపర్), షెల్డన్ జాక్సన్, ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, బెన్ కటింగ్, వెంకటేష్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, హర్భజన్ సింగ్, పవన్ నేగి, వైభవ్ అరోరా, పాట్ కమ్మిన్స్, లాకీ ఫెర్గూసన్, ప్రసీద్ కృష్ణ, సందీప్ వారియర్, శివం మావి, కమలేష్ నాగర్‌కోటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News