ప్రాణాంతక కరోనా వైరస్ (CoronaVirus) కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 13 నిర్వహణపై సందిగ్దత నెలకొంది. ఐపీఎల్ వాయిదా పడుతుందని కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇదివరకే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఐపీఎల్ నిర్వహించేది లేదని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి మార్చి 14న సమావేశం కానుంది. ఐపీఎల్ నిర్వహణపై చర్చించి వాయిదా వేయాలా లేక షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు నిర్వహించాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read: ఐపీఎల్ ఫైనల్‌ను తలపించే తొలి పోరు!
ఐపీఎల్ నిర్వహణపై సందేహాలు తొలగాలంటే మరో 24 గంటలు వేచిచూడక తప్పదు. శనివారం నాడు మెగా టోర్నీ ఐపీఎల్ నిర్వాహకులు, మేనేజ్ మెంట్ సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఐపీఎల్ తాజా సీజన్ మార్చి 29న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌తో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కరోనాను మహమ్మారిగా అభివర్ణించిన డబ్ల్యూహెచ్ఓహెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం మార్చి 13 నుంచి ఏప్రిల్ 15 వరకు వీసాలను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: సన్ రైజర్స్ హైదరాబాద్ IPL 2020 షెడ్యూల్.. SRH తొలి మ్యాచ్ ఎవరితో!
కాగా, కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా సమూహంగా నలుగురు లేక అంతకంటే వ్యక్తులు ఉండరాదని వైద్య ప్రపంచం హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. వేలల్లో జనం మ్యాచ్‌లకు తరలిరావడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. దీంతో ఐపీఎల్ వాయిదా పడనుందా.. లేక రద్దు కానుందా అని క్రికెట్ అభిమానులతో పాటు అధికారులు చర్చించుకుంటున్నారు.
IPL నిర్వహణపై స్పష్టత ఎప్పుడంటే!