'కరోనా వైరస్'.. భారత దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. కరోనా రోగులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఈ క్రమంలో వైద్యులు సైతం 24 గంటలు సేవలు అందిస్తున్నారు. పోలీసులు 24 గంటలు రోడ్లపై గస్తీ తిరుగుతున్నారు. మరోవైపు కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని స్వచ్ఛందంగా వైద్యం కోసం రావాలని కోరుతున్నారు. ఒకవేళ కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు స్వచ్ఛందంగా రానిపక్షంలో వారి జాడ తెలుసుకుని ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయాయి. భారత దేశంలోనూ ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఐతే పేదవారు, రోజూ కూలి పని చేసుకుని జీవితం గడిపే వారు ఇబ్బంది పడుతున్నారు.
'కరోనా వైరస్' ఉద్ధృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. అందుబాటులో ఉండే టెక్నాలజీని విరివిగా వాడుకోవడం మొదలు పెట్టింది. ఇప్పటి వరకు విదేశాలకే పరిమితమైన అధునాతన టెక్నాలజీని హైదరాబాద్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
'కరోనా' నుంచి కోలుకున్నాడు.. పుట్టిన రోజు చేసుకున్నాడు. అవును మీరు విన్నది నిజమే. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. అతి కొద్ది కాలంలోనే లక్షల మందికి వ్యాప్తి చెందిన వైరస్ కారణంగా జనం పిట్టల్లా రాలుతున్నారు. కానీ ఓ వృద్ధుడు మాత్రం .. కరోనా వైరస్ ను ఎదురించి నిలబడ్డాడు.
దేశ రాజధాని ఢిల్లీలో అద్భుతం జరిగింది. కరోనా వైరస్ ఉన్న ఓ మహిళ ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది. ఎయిమ్స్ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన దేశంలో ఇప్పుడు సంచలనంగా మారింది.
'కరోనా వైరస్' ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ పరిధిలోకి వెళ్లిపోయాయి. భారత దేశం కూడా 21 రోజులపాటు లాక్ డౌన్ పకడ్బందీగా పాటిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 2 గంటలు... సాయంత్రం మరో 2 గంటలు మాత్రం నిత్యావసర వస్తువుల కోసం బయటకు వచ్చేందుకు అనుమతి ఇచ్చారు.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది. దీంతో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నిరంతరం పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐతే వారి ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా.. !
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. భారత దేశంలోనూ క్రమక్రమంగా పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళనకు గురి చేస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
'కరోనా వైరస్'పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ .. పాటాస్త్రం సంధించాడు. అవును..కరోనా వైరస్ విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన గొంతు సవరించాడు. 'కరోనా'పై పాట కూర్చి .. స్వయంగా పాడాడు వర్మ.
దేశంలో కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ ను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఐనప్పటికీ కరోనా వైరస్ విస్తృతి తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెడుతున్నాయి.
ఢిల్లీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. 'కరోనా వైరస్'ను ఎదుర్కోవడంలో వైద్యులు, పారామెడికల్, పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించింది. వారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
'కరోనా వైరస్' భారత దేశంలో క్రమక్రమంగా విస్తరిస్తోంది. నిన్నటి వరకు 13 వందల 97గా ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈ రోజు దాదాపు 15 వందలకు చేరువకు వెళ్లింది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. నిజాముద్దీన్ మర్కజ్ భవనంలో ఉన్న వ్యక్తుల్లో చాలా మంది పాజిటివ్ లక్షణాలతో ఉన్నారు.
'కరోనా వైరస్'.. ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ దెబ్బకు దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. దీంతో జనం బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఐతే కొంత మంది ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా ఉండలేమంటూ రోడ్ల మీద తిరుగుతున్నారు.
తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా కాల్చిపారేయాలన్నారు.
'కరోనా వైరస్' తెలంగాణను బెంబేలెత్తిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న వైరస్ బాధితుల సంఖ్య గుబులు పుట్టిస్తోంది. దీంతో కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు భారీగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 'కరోనా' అలజడి కొనసాగుతోంది. నిజాముద్దీన్ లోని మర్కజ్ భవనంలో దాదాపు 24 వందల మంది ఒకే చోట మత ప్రార్థనలు చేయడం... వారిలో 24 మందికి 'కరోనా వైరస్' పాజిటివ్ రావడం.. ఇప్పుడు కలకలం రేపుతోంది.
'కరోనా వైరస్' మహమ్మారిని ఎదుర్కునేందుకు మనసున్న మారాజులు ముందుకొస్తున్నారు. ఇప్పటి వరకు వీఐపీలు, సెలబ్రిటీలు, రాజకీయ, సినీ ప్రముఖులు విరాళాలు ఇవ్వడం చూశాం. ఇప్పుడు ఉద్యోగులు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.