PM Modi-vande bharat : దేశంలో చేపట్టి వందే భారత్ రైలు కార్యక్రమంలో భాగంగా నాలుగో రైలును దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ రైలును ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి అందౌరా వరకు ఈ ట్రైన్ నడుస్తుంది.
Ask Ktr: బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై టీఆర్ఎస్ పోరాడుతోందన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ కన్నా గట్టిగా నిలదీస్తున్నామని చెప్పారు. ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌కు, అదేవిధంగా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్ (Kamala Harris) కు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (president Ram Nath Kovind), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుభాకాంక్షలు తెలియజేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై రాజ్యసభ (Rajya Sabha) లో తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు.. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ (Harivansh) పై అనుచితంగా ప్రవర్తించారంటూ.. చైర్మన్ వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) 8మంది సభ్యులను ఆదివారం సస్పెండ్ చేశారు.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభణ కొనాసాగుతూనే ఉంది. నిత్యం 90వేలకు పైగా కరోనా కేసులు, 1100లకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా కేసులు, మరణాలు నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సమావేశం కానున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi ) జన్మదినం సెప్టెంబరు 17న జరగనుంది. ఈ ఏడాది ప్రధాని 70వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే.. మోదీ జన్మదినం ( Narendra Modi Birthday) సందర్భంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 49 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. రెండు రోజుల పర్యటన కోసం భారత్ రానున్నారు. ఫిబ్రవరి 24న ఆయన తొలిసారిగా భారత దేశానికి వస్తున్నారు. ఆయనతోపాటు భార్య మెలానియా ట్రంప్ కూడా రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మిజోరాం లో పర్యటిస్తున్నారు. అక్కడ జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ప్రధాని ఐజ్వాల్ లో 60 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు ను ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ- ' ఏ సమస్య వచ్చిన మీరు ఢిల్లీకి రావక్కర్లేదు.. మీ వద్దకే అధికారులు వస్తారు' అని అన్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఫిలిప్పీన్స్ కు బయలుదేరి వెళ్లారు. ఆయన మూడు రోజులపాటు ఫిలిప్పీన్స్ లో పర్యటించనున్నారు. ఈమేరకు పీఎంవో కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఇండియన్-ఏసియన్’ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఫిలిప్పైన్స్ వెళ్లనున్నారు. మూడు రోజుల ఈ అధికారిక పర్యటనలో మోదీ 'ఇండియన్-ఏసియన్' సదస్సు, తూర్పు ఆసియా సదస్సు, ఏసియన్ బిజినెస్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సుల్లో పాల్గొంటారు. వీటితో పాటు ‘ఏసియన్’ 50వ వార్షికోత్సవాలకు హాజరవుతారు. అక్కడ వివిధ దేశఅధ్యక్షులతో భేటీ అవుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.