Rajasthan Assembly Elections 2023: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ వచ్చింది. ఆ పార్టీలో సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాలు సద్దుమణిగాయి. వచ్చే ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్‌తో కలిసి కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తానని సచిన్ ప్రకటించాడు.
CM Ashok Gehlot Vs Sachin Pilot: రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్ పార్టీ వీడుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన కొత్త పార్టీ స్థాపిస్తారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తోంది.
Rajasthan Crisis: రాజస్థాన్ లో కాంగ్రెస్ లో సంక్షోభం మరింత ముదిరింది. ఆ రాష్ట్రాన్ని బీజేపీ చేతికి అప్పగించే వరకు వెళ్లింది. రాజస్థాన్ కాంగ్రెస్ పంచాయతీ ఢిల్లీకి చేరింది. రాజస్థాన్ పరిస్థితులను చక్కబెట్టేందుకు నియమించిన పరిశీలకులు పార్టీ చీఫ్ సోనియా గాంధీని కలిశారు. వాస్తవ పరిస్థితిని వివరించారు.
Rajasthan cabinet reshuffle: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ కేబినెట్ విస్తరణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొత్తగా 15 మందిని మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు సమాచారం.
రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై ( Rajastan political crisis ) ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువనేత సచిన్ పైలట్ స్పందించారు. సంక్షోభం సమయంలో తన ప్రత్యర్థి వర్గం తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. చాలా బాధించాయని, రాజకీయాల్లో ఒక పద్ధతి పాటిస్తే బాగుంటుందని సచిన్ పైలట్ ( Sachin Pilot ) అభిప్రాయపడ్డారు.
రాజస్థాన్ సంక్షోభం సమసినట్టే కన్పిస్తోంది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తో కాంగ్రెస్ అధిష్టానం జరిపిన చర్చలు సఫలీకృతమైనట్టుగా తెలుస్తోంది. సచిన్ పైలట్ వ్యాఖ్యలే దీనికి కారణం. ఐదేళ్ల కోసం కష్టపడి ప్రభుత్వం ఏర్పరిచామని సచిన్ వ్యాఖ్యానించడమే దీనికి కారణం.
గత కొన్ని రోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎవరి క్యాంపు వారిదన్నట్లు వ్యవహరించిన కాంగ్రెస్‌లోని వర్గాలు సయోధ్యకు వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నెల రోజుల నుంచి రాజస్థాన్ అధికార కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన సచిన్ పైలట్ మరలా యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం.
Rajasthan Congress MLAs | రాజస్థాన్ రాజకీయ హైడ్రామా మరో మూడు వారాల్లో ఓ కొలిక్కి రానుంది. అప్పటివరకూ తన వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
రాజస్థాన్ రాజకీయ సంక్షోభాన్ని ఈ విధానంలో ఎదుర్కోలేమని భావించిన సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వెనక్కి తగ్గింది. స్పీకర్ సీపీ జోషి (Rajasthan Assembly Speaker CP Joshi) తన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ఉపసంహరించుకున్నారు.
న్యూ ఢిల్లీ: సచిన్ పైలట్‌కి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ( Sachin Pilot's supporters ) అంతా బీజేపి చేతిలో బంధీలుగా ఉన్నారని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు సచిన్ పైలట్‌కు మద్దుతు పలుకుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
రాజస్థాన్ ( Rajasthan CM ) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ( Ashok Gehlot ) కు సర్వోన్నత న్యాయస్థానం నుంచి షాక్ ఎదురైంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల పిటీషన్ పై ఉత్తర్వులు జారీ చేయకుండా హైకోర్టును నిలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంతీర్పుతో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వర్గం నిరాశకు లోనైంది.
రాజస్తాన్ తిరుగుబాటు నేత, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కు ఊరట లభించింది. రెబెల్ ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ రాజస్థాన్ హైకోర్టు ఆదేశించడంతో సచిల్ పైలట్ ఊపిరి పీల్చుకున్నారు.
జైపూర్: సచిన్ పైలట్ ( Sachin Pilot ) గత ఆరు నెలలుగా బీజేపీ మద్దతుతో రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రకు పాల్పడుతున్నాడని.. చూడ్డానికి అమాయకుడిలా కనిపించే సచిన్ అలా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ( CM Ashok Gehlot ) అన్నారు.
Congress MLAs Antakshari | రాష్ట్రంలో రాజకీయం పూర్తిగా వేడెక్కింది. సీఎం పదవి కోసం అధిష్టానానికి ఎదురు తిరగడంతో సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం, పార్టీ చీఫ్ పదవుల నుంచి తప్పించారు. అయినా తలొగ్గకపోవడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దుచేస్తూ కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది.
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో వివాదం రోజురోజుకూ ముదురుతోంది. కీలకనేత సచిన్ పైలట్, మరో 18 సభ్యులను అనర్హులుగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఆ నేతలు హైకోర్టు మెట్లెక్కారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేల పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది.
Rajasthan political crisis: కాంగ్రెస్ పార్టీని వీడే నాయకులను ఉద్దేశించి ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పార్టీ నుంచి వెళ్లాలనుకునే వాళ్లను వెళ్లనివ్వండని పేర్కొన్నట్లు వార్తలొస్తున్నాయి.
బీజేపీలో చేేరే విషయమై రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ మరోసారి స్పష్టత ఇచ్చారు. తాను బీజేపీలో చేరడం లేదని స్పష్టంగా చెప్పారు. ఆ పార్టీపై పోరాడి గెలిచినప్పుడు అదే పార్టీలో ఎలా చేరతామని పైలట్ ప్రశ్నించారు.
Rajasthan Political Crisis: రాజస్థాన్ రాజకీయ సంక్షోభంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తీవ్ర ( CM Ashok Gehlot ) అసహనం వ్యక్తంచేశారు. ఈ విషయంలో సచిన్ పైలట్ ( Sachin Pilot ) చేతుల్లో ఏమీ లేదని.. బీజేపీనే ఈ డ్రామాను అంతా నడిపిస్తోంది అని అశోక్ గెహ్లట్ మండిపడ్డారు.
Congress govt is stable in Rajasthan | రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉందని, తమకు ఏ ఢోకా లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ కీలకనేత రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. పూర్తిస్థాయి అయిదేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాజస్థాన్ కాంగ్రెస్ (Congress) లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ (Sachin Pilot) మధ్య వైరం తారస్థాయికి చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడే పరిస్థితి కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.