Nandigama Suresh : ఎంపీ నందిగామ సురేష్ మీడియాతో మాట్లాడారు. వర్షం వస్తే మునిగిపోయే చోట అంబేద్కర్ విగ్రహం పెట్టాడని చంద్రబాబు మీద కౌంటర్లు వేశాడు. అంబేద్కర్ మన దేవుడని భావించిన వైఎస్ జగన్ మాత్రం నగరం నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేశాడని అన్నాడు.
Tarakaratna Wife Alekhya Reddy in to Politics: అనూహ్యంగా నందమూరి తారకరత్న మరణించడంతో ఆయన చివరి కోరిక తీర్చేందుకు ఆయన భార్య అలేఖ్య రెడ్డి రంగంలోకి దిగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంటున్నారు.
AP SSC 10th Results 2023 Date and Time Announced: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్. శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా..
CM YS Jagan Mohan Reddy: కళ్యాణ్ మస్తు, షాదీ తోఫా లబ్ధిదారులకు గుడ్‌న్యూస్. రూ.87.32 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. 12,132 మంది లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అయింది.
ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. హిందువులపై దాడులు చేసేలా ప్రభుత్వం తీరు ఉందని విరుచుకుపడ్డారు. పూర్తి వివరాలు ఇలా..
AP Tenth Results Date and Time: ఏపీలో ఫలితాల విడుదల కోసం విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మే రెండో వారంలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రిజల్ట్స్ ఎక్కడ చూడాలి..? ఎలా చెక్ చేసుకోవాలి..? వివరాలు ఇలా..
YS Viveka Murder Case : మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న వాచ్ మెన్ రంగన్నకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్తమాతో బాధపడుతున్న ఆయన్ను పులివెందుల నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించారు.
Supreme Court Green Signal To SIT Enquiry: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సిట్ విచారణకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేసింది. ఏపీ ప్రభుత్వ వాదనతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది.
క్రిస్టియన్ సోదరుల కోసం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం నాలుగేళ్లలో 3 సార్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతకాలు పెట్టారని గుర్తుచేశారు. అయినా ఇప్పటివరకు అధికారులు పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్ సంతకానికి విలువ లేకుండా పోయిందన్నారు.
Chitfund Case : జగజ్జనని చిట్ ఫండ్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావ్, టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు కోర్టు రిమాండ్ విధించింది. మే 12 వరకు రిమాండ్ విధిస్తూ తూర్పుగోదావరి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.
Vijayawada Railway Court Dismissed Tuni Train Fire Case: తుని రైలు దహనం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో రైల్వే పోలీసులు సరిగా దర్యాప్తు చేపట్టలేదని అభిప్రాయపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Balineni Srinivas Reddy : బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్సీపీకి షాక్ ఇచ్చాడు. రీజనల్ కో ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. చిత్తూరు నెల్లూరు తిరుపతి జిల్లాలకు కో ఆర్డినేటర్‌గా ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
Chandrababu Naidu : అబద్దాల కోరు సీఎం జగన్‌ను రానున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలని బంగాళాఖాతంలో కలిపేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ పరిగెడుతుందని ప్రజల్లో ఉత్తేజాన్ని నింపాడు.
Vizag Kidney Rocket : విశాఖలోని కిడ్నీ రాకెట్ మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కిడ్నీ దందా నిర్వహించిన తిరుమల హాస్పిటల్‌ను సీజ్ చేసింది. డీఎంహెచ్‌వో నివేదికతో ఆస్పత్రిని సీజ్ చేశారు. అనుమతి లేకుండా ఆపరేషన్ చేయడంతో సీజ్ చేశారు.
Chandrababu Naidu On CM Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఒక యుగపురుషుడు పుట్టినట్టే.. యుగానికి ఒక రాక్షసుడు పుట్టాడంటూ ఫైర్ అయ్యారు. దళిత నేతల సమావేశంలో ‘దళితద్రోహి జగన్ రెడ్డి: దళితబాంధవుడు-పేదలపెన్నిధి చంద్రన్న’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Visakhapatnam Inter Student: విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో ఓ విద్యార్థిని వైసీపీ నేత చితక్కొట్టాడు. బాలుడు తన కారులో కూర్చొని ఉండడంతో దొంగతనం కోసం వచ్చాడని ఆగ్రహంతో దుస్తులు విప్పించి నగ్నంగా నిల్చొబెట్టాడు. బాలుడిపై పిడిగుద్దులు కురిపించాడు. వివరాలు ఇలా..
Avinash Reddy Released Video Over Viveka Murder Case: వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో వివరిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి వీడియోను విడుదల చేశారు. ఆ రోజు వివేకా రాసిన లెటర్‌ను రాజశేఖర్ రెడ్డి, సునీతమ్మ ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. సీబీఐ ఎందుకు ఈ లెటర్‌ను డౌన్ ప్లే చేస్తుందని అడిగారు. ఆ వీడియో ఆయన చెప్పారంటే..?
Telangana High Court Cancels Erra Gangireddy Bail: ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న గంగిరెడ్డి బయట ఉంటే.. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టులో సీబీఐ వాదించింది. సీబీఐ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.
CM Jagan Comments On Chandrababu Naidu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ముసలి పులితో పోల్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. నరమాంసం తినే పులి ముసలిదైపోయిందని.. దగ్గరకు వస్తే తినేద్దామని చూస్తోందంటూ పంచతంత్ర కథతో పోల్చారు. అనంతపురం జిల్లా నార్పలలో జగనన్న వసతి దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.
MLA Rachamallu Siva Prasad Reddy Comments on MP Avinash Reddy Arrest: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. అయితే బెయిల్‌పై మళ్లీ విడుదల అవుతారని.. ఆయన కుట్ర జరుగుతోందన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.