కర్ణాటక రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు విషయమై బీజేపి అధ్యక్షుడు అమిత్ షా, బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపి నడ్డాలతో భేటీ అయి చర్చించేందుకు కర్ణాటక బీజేపి అగ్రనేతలు ఢిల్లీకి చేరుకున్నారు
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్, కాంగ్రెస్ వర్గాల్లో చీలికలు మొదలయ్యాయని.. చాలామంది బీజేపీకి తరలిరావాలని భావిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు.
కర్ణాటక అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రోటెమ్ స్పీకర్‌గా నామినేట్ చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా ఉత్తర్వులు జారీచేశారు. రేపు శనివారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి, జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి మధ్య జరగనున్న బల పరీక్షను ప్రొటెమ్ స్పీకర్‌గా నామినేట్ అయిన కేజీ బోపయ్య పర్యవేక్షించనున్నారు. కర్ణాటక అసెంబ్లీలో శనివారం సాయంత్రం 4 గంటలకు బల పరీక్ష నిర్వహించి బీజేపీ తమ మెజార్టీ నిరూపించుకోవాల్సిందిగా నేడు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కర్ణాటక రాష్ట్ర సర్కార్ ఈ బల పరీక్షకు వెళ్తోంది.
కర్ణాటకలో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ కూటమి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుగుతున్న సందర్భంగా కర్ణాటక పాలిటిక్స్‌పై ఓ వాట్సాప్ జోక్ ప్రస్తావనకు రావడంతో కాసేపు కోర్టులో నవ్వులు విరబూశాయి. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన మెజార్టీ భారతీయ జనతా పార్టీకి వుందని ఆ పార్టీ తరపున కోర్టులో వాదనలు వినిపించిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ కోర్టుకు తెలిపారు.
కర్ణాటక రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ నిరూపించుకొని సీఎం కుర్చీలో శాశ్వతంగా ఉండాలని ఇరు పార్టీలు భావిస్తున్న వేళ.. కొత్త సీఎం యడ్యూరప్ప సరికొత్త నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.