Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ బీహార్ పర్యటనపై స్పందించిన రేవంత్ రెడ్డి.. చనిపోయిన తెలంగాణ ఆర్మీ జవాన్ల కుటుంబాలను కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని అడిగారు.
KCR JAIL: బండి సంజయ్ కామెంట్లతో రంగంలోకి దిగింది కాంగ్రెస్. బీజేపీ నేతలకు షాకిచ్చింది. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం సోమవారం ఉదయం కరీంనగర్ జైలుకు వెళ్లింది.
JP NADDA: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. హన్మకొండ సభలో ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను నయా నిజాంతో పోల్చిన జేపీ నడ్డా.. నిజాంను సాగనంపేందుకే బండి సంజయ్ ప్రజా సంగ్రాయ యాత్ర చేస్తున్నారని చెప్పారు. తెలంగాణను కేసీఆర్ చీకట్లోకి తీసుకువెళ్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలా మారిపోయిందన్నారు జేపీ నడ్డా.
Target KCR: జేపీ నడ్డా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి మాట్లాడటంతో కేంద్రం నుంచి ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కొన్ని రోజులుగా తెలంగాణలో మకాం వేసిన కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో పాటు కాగ్ టీమ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫోకస్ చేసిందని చెబుతున్నారు
KCR MEETINGS: జాతీయ రాజకీయాలపై కేసీఆర్ గందరగోళంలో ఉన్నారా? బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో ఆయన వెనక్కి తగ్గారా? అంటే ఏమి చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై హడావుడి చేస్తున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనేతలను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు.
Revanth Reddy: తెలంగాణలో రామగుండం ఎరువుల పరిశ్రమలో ఉద్యోగాల పేరిట అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లేఖ రాశారు.
Ponguleti Srinivas Reddy Political Plans: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ పేరు తెలుగురాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీకి అప్పట్లో ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ.. ఆ ఇబ్బందులను అధిగమించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకున్న సత్తా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంతం.
Bandi Sanjay: బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులు, అక్రమ కేసుల నమోదుకు నిరసనగా కరీంనగర్ లోని తన నివాసంలో దీక్ష చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పలువురు బీజేపీ నేతలు ఆయన దీక్షుకు మద్దతు తెలిపారు. దీక్ష సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. టీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
MP ARVIND: దేశంలో జరుగుతున్న అత్యంత అవినీతిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ భ్రష్టు పట్టడంలో కేసీఆర్ హస్తం ఉందన్నారు. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో లిక్కర్ పాలసీకి సంబంధించిన సమావేశాలు నిర్వహించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ పర్యటనలను ప్లాన్ చేసింది కవితే అన్నారు. ఎమ్మెల్సీ కవిత పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.
Dharmapuri Arvind Warning To CM KCR: త్వరలోనే సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాగోతం కూడా బయటికొస్తుందని బీజేపి నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ లో టీఅర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు వినొస్తుండటంపై స్పందిస్తూ ధర్మపురి అరవింద్ కేసీఆర్ కుటుంబంపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Telangana CM KCR fires on closing ceremony of independence day celebrations. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా పేదల ఆశలు నెరవేరలేదు అని తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సింగ్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీని డిసైడ్ చేసింది కేసీఆర్ ఫ్యామిలీనే అని ఆరోపణలు చేశారు. పంజాబ్, బెంగాల్ మద్యం పాలసీల వెనక కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందన్నారు.
Delhi Liquor Scam: ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కాంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణలోని అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ప్రచారం సాగుతుండగా.. తాజాగా సీఎం కేసీఆర్ కుటుంబం లింకులు బయటకు రావడం కలకలం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.