MP Santosh Rao: సీబీఐ, ఈడీ దాడులకు భయపడి హైదరాబాద్ వీడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ తనపై జరుగుతున్న ప్రచారంపై ఎంపీ సంతోష్ రావు స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన సంతోష్ తనపై కొన్ని రోజులుగా జరగుతున్న ప్రచారం అసత్యమని చెప్పారు.
KCR NEW PARTY: చాలా కాలంగా జరుగుతున్న ప్రచారమే నిజం కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఖాయమైంది. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్.. కొత్త పార్టీపై ఫైనల్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
Kcr National Politics: కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బీజేపీ ముక్త భారత్ అంటూ నినదిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు చేశారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలో చర్చలు జరిపారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యమని చెబుతూ వస్తున్నారు. అయితే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ జాతీయ రాజకీయాలు కాంగ్రెస్ కూటమి వైపు కదులుతున్నట్లుగా కనిపిస్తోంది.
Kodandaram : సీఎం కేసీఆర్ పాలనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు టీజేఎస్ చైర్మెన్ కోదండరామ్. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో పాలన మారాలంటే ప్రతి ఒక్కరూ మళ్లీ ఉద్యమించాలని కోదండరామ్ పిలుపిచ్చారు. యువతపైనే ఆ బాధ్యత ఉందన్నారు.
Kishan Reddy: సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ దిగజారిందన్నారు. రాష్ట్రానికి అప్పులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.
Telangana Politics: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీపై మొదటి నుంచి దూకుడుగా పోరాడుతున్నారు రేవంత్ రెడ్డి. టీడీపీలో ఉన్నప్పుడే కేసీఆర్ ఫ్యామిలీని ఓ రేంజ్ లో ఆయన టార్గెట్ చేశారు. ఓటుకు నోటు కేసులో జైలుకు కూడా వెళ్లారు. జైలు నుంచి వచ్చాక కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు రేవంత్ రెడ్డి.
Munugode Bypoll: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. మునుగోడులో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి.
PK TEAM: తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పీకే టీమ్ పలు సర్వేలు నిర్వహించింది. సీఎం కేసీఆర్ కు ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తోంది. ప్రశాంత్ కిషోర్ కూడా కేసీఆర్ తో సుదీర్ఘ మంతనాలు సాగించారు. అయితే తాజాగా పీకే టీమ్ తెలంగాణ నుంచి వెళ్లిపోయిందని తెలుస్తోంది.
KTR ON JAGAN: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య గతంలో మంచి బంధం ఉండేది. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఓపెన్ గానే ప్రకటనలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా ఏపీ అసెంబ్లీలోనే కేసీఆర్ కు ఆయన సెల్యూట్ చేశారు. ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.
Sangareddy Collecter: జిల్లా పాలనకు సుప్రిం కలెక్టర్. శాంతిభద్రతల హెడ్ ఎస్పీ. జిల్లా ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతాయుత పోస్టులో ఉన్న కొందరు సివిల్ సర్వెంట్లు దారి తప్పుతున్నారు. తెలంగాణలో కొందరు అధికారులు బరి తెగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
చారిత్రక సెప్టెంబర్ 17 ను పురస్కరించుకుని గిరిజన ఆత్మ గౌరవ భవనాల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు. గిరిజనులు, ఆదివాసీలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతున్నాయన్నారు.
Telangana Liberation Day: తెలంగాణ స్టేట్ ఇండియన్ యూనియన్ లో విలీనమైన సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత దినోత్సవంగా జరిపింది తెలంగాణ సర్కార్. పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. జిల్లాల్లో మంత్రులు జెండా ఎగురవేశారు.
Hyderabad Liberation day: సెప్టెంబర్ 17.. తెలంగాణ స్టేట్ ఇండియన్ యూనియన్ లో కలిసిపోయిన రోజు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే.. తెలంగాణ స్టేట్ ప్రజలకు మాత్రం సెప్టెంబర్ 17న వచ్చింది. అయితే సంబరాలు చేసుకోవాల్సిన సెప్టెంబర్ 17 చుట్టూ తెలంగాణలో వివాదాలు అలుముకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.