CAA-2019 Rules Implement Ahead Of Lok Sabha Elections: పార్లమెంట్ ఎన్నికలకు కొద్దిరోజుల ముందర కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం-2019ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
Rachna Banerjee as TMC MP Candidate: 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం దేశంలోని అన్ని పార్టీలు సమాయాత్తం అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల తొలిజాబితాను ప్రకటించాయి. తాజాగా పశ్చిమ బంగలోని అధికార టీఎంసీ అధినేత్రి రాష్ట్రంలోని 42 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించి సంచలనం రేపారు. ఇందులో బాలయ్య, చిరంజీవిలతో నటించిన రచన బెనర్జీ ఉండటం విశేషం.
Yusuf Pathan TMC Candidate: ఇన్నాళ్లు క్రికెట్లో ప్రత్యర్థులను చెడుగుడు ఆడిన మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఇకపై ఆడాల్సిన సమయం వచ్చింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన కాంగ్రెస్ కీలక నాయకుడితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు.
లోక్‌సభ ఎన్నికల సమయం ముందు తమిళనాడులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ డీఎంకేకు మద్దతునిచ్చారు. మద్దతునిచ్చిన కారణంగా రాజ్యసభ ఎన్నికల్లో 2025 రాజ్యసభ ఎన్నికల్లో కమల్‌హాసన్ పార్టీకి ఓ సీటు ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కమల్ హాసన్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సమావేశమయ్యారు. కొన్ని గంటల పాటు చర్చలు జరిపారు.
Mohammed Shami Political Entry: భారత క్రికెటర్ మహ్మద్ షమీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో అత్యధిక స్థానాలు సాధించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ షమీని అస్త్రంగా చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే బసీర్హట్ స్థానం నుంచి షమీని పోటీ చేయించాలని చూస్తోంది. కొద్ది రోజుల్లో షమీ రాజకీయ ప్రవేశం ఉంటుందని సమాచారం.
BRS Party MP Candidates: అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమైన గులాబీ పార్టీ ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇద్దరు సిట్టింగ్‌లకు, ఇద్దరు మాజీలకు అవకాశం కల్పించింది.
Kishan Reddy Fire On Revanth Reddy: పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీజేపీ అందులో భాగంగా యాత్రలు చేపట్టింది. ఐదు యాత్రలతో తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేపట్టింది. ఈ యాత్రల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Lok Sabha Elections 2024: దేశంలో అందరి దృష్టి ఇప్పుడు ఎన్నికలపైనే ఉంది. ఇక పార్టీలు అసలైన సమరంలో గెలవాలనే పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు ఎప్పుడు రావొచ్చనే స్పష్టత వచ్చింది.
BRS Party MLAs Touch: తెలంగాణలో జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను చేర్చుకునేందుకు రెండు పార్టీలు చూస్తున్నాయి. తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Lok Sabha Election 2024 Survey: ఎప్పటికప్పుడు నిరంతర వార్తా ప్రసారాలతోపాటు విశేషాలు, ప్రపంచంలో జరిగే పరిణామాలను వేగంగా అందిస్తున్న జీన్యూస్ మరో ప్రజా ప్రయత్నం చేపట్టింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఓ సర్వే చేపడుతోంది. దీనిలో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలని 'జీ న్యూస్' పిలుపునిస్తోంది.
Never Spoke In Parliament: తమ సమస్యలను పరిష్కరిస్తారనే ఆశతో ప్రజలు తమ ఓట్ల ద్వార ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రం అధికారంలో కొనసాగుతూ ప్రజలను పట్టించుకోరు. వారు ఎంతలా అంటే చట్టసభలో తమ వాణి కూడా వినిపించనంతగా. తాజాగా ముగుస్తున్న లోక్‌సభలో కొందరు నోరు కూడా విప్పలేని పరిస్థితి ఉంది. ఇక వారు గెలిచి ఏం ప్రయోజనమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Telangana: సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. ఈసారి గతానికి కన్నా ఎక్కువ స్థానాలు సాధించడానికి 'పంచ వ్యూహం' రచించింది. రాష్ట్రవ్యాప్తంగా యాత్రల మీద యాత్రలు చేయాలని నిర్ణయించింది.
Bonthu Rammohan: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. కీలక నాయకులంతా పార్టీని వీడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన కీలక నాయకుడు ముఖ్యమంత్రిని కలిశారు.
Amit Shah: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీలో పొత్తులపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ అవసరం లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
Asssam APP Candidates: ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఒంటరిదైపోతున్నట్టు కనిపిస్తోంది. పశ్చిమబెంగాల్, యూపీ, పంజాబ్, ఢిల్లీలో టీఎంసీ, ఎస్పీ, ఆప్ ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తుండగా తాజాగా అస్సాంలోనూ ఆప్ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థులను ప్రకటించింది.
Sonia Contest In Telangana: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్‌సభ సమరంలోనూ పునరావృతం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయాలని కొన్నాళ్ల నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా సోనియాను కలిసి ఈ విన్నపాన్ని చేశారు.
EC Orders To Political Parties: చిన్నారులపై ప్రపంచవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. వారితో పనులు చేయిస్తున్నాయి. వీటికి రాజకీయ పార్టీలు కూడా అతీతం కావు. తమ రాజకీయ కార్యక్రమాలకు చిన్నారులను వినియోగించడంపై విమర్శలు వస్తున్నా పార్టీలు వినిపించుకోవడం లేదు. ఈ విషయమై ఎన్నికల సంఘం స్పందించి కఠిన ఆదేశాలు జారీ చేసింది.
Kharge Last Election Comments: దేశంలో రానున్న లోక్‌సభ ఎన్నికలు చివరివి కాబోతున్నాయని.. ఆ తర్వాత దేశం మొత్తం నియంత పాలనే ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇక తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది కనుమరుగవుతుందని హెచ్చరించారు.
Seethakka Vs KTR: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలపై తెలంగాణ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ.. ప్రజాక్షేత్రంలోనూ తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్‌పై సీతక్క విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్‌లో కేటీఆర్ పెంచుకునే కుక్కల కోసం రూ.12 లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారని మండిపడ్డారు.
Siddipet Thanks Meet: తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన సిద్దిపేట నియోకవర్గ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కృతజ్ణతలు తెలిపారు. ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పి.. పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే సత్తా చూపి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.