Second Phase Lok Sabha Elections Completed Peaceful: లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్, కేరళ, జమ్మూకశ్మీర్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కీలకమైన స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. వేసవి ఎండల నేపథ్యంలో ఉదయం, సాయంత్రం ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. సినీ తారలు, పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Summer Heat Effect Voters Died After Casting Vote: ఓటు ప్రాణాలు తీస్తోంది. ఓటు వేసేందుకు వెళ్లిన వారిపై సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలకు తాళలేక వృద్ధులు కుప్పకూలిపోతున్నారు. ఇలా ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందడం విషాదం నింపింది.
YSRCP Manifesto: మరోసారి అధికారం సొంతం చేసుకునేందుకు సీఎం వైఎస్ జగన్ భారీ వ్యూహంతో సిద్ధమయ్యారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలు, ప్రజాకర్షన పథకాలను సీఎం జగన్ ప్రకటిస్తారని సమాచారం. మహిళలు, రైతులు, యువతకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Harish Rao Challenge: తెలంగాణలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో హరీశ్ రావు తన రాజీనామాతో గన్‌పార్క్ వద్దకు రాగా.. రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించలేకపోయారు. రుణమాఫీ ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ అమలు చేయకుంటే తన రాజీనామాను ఆమోదించుకోవాలని హరీశ్ రావు సంచలన సవాల్ విసిరారు. కానీ రేవంత్ రెడ్డి నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.
Nominations Finished In Telangana And Andhra Pradesh For Elections: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పూర్తయ్యాయి. ఆఖరి రోజున అభ్యర్థులు నామినేషన్లు పూర్తి చేసేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పూర్తవడంతో అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచనున్నారు.
My Age Is Our Telangana Future Is Youth Says KCR: ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. తన వయసైపోతుందని పేర్కొంటూనే తెచ్చిన తెలంగాణ యువకులేదనని చెప్పారు.
Revanth Reddy Convoy Ambulance Saves Life: ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. ప్రచారంలో జరిగిన ఓ సంఘటనలో వ్యక్తి ప్రాణాలు కాపాడారు. అంబులెన్స్‌కు పంపించి వెంటనే వైద్య సహాయం అందించేలా చూశారు.
YS Sunitha Reddy Bandage Suggest To YS Jagan: ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. వైఎస్ కుటుంబం మధ్య ఇది తీవ్ర దుమారం రేపుతుండగా వైఎస్ సునీత కీలక విమర్శలు చేసింది.
Nomination Process Finished For Telangana And AP Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు పూర్తవడంతో అభ్యర్థులు ప్రచారం స్పీడ్ పెంచనున్నారు.
YS Sharmila Slams No Capital To Andhra Pradesh: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. తన సోదరుడు, సీఎం జగన్‌తోపాటు చంద్రబాబు, ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు.
Will End Muslim Reservations Says Amit Shah: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణను ఢిల్లీకి ఏటీఎం చేశారని ఆరోపించారు. బీజేపీకి 12 సీట్లు ఇవ్వాలని కోరారు.
Raja Singh: హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలతకు భారీ షాక్ తగిలింది. మొదటి నుంచి ఆమె అభ్యర్థిత్వం వ్యతిరేకిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆమె నామినేషన్ ర్యాలీకి గైర్హాజరు కావడం కలకలం రేపింది. మాధవీలతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాజా సింగ్ పార్టీ ఆదేశించినా కూడా ఆమెకు లోక్‌సభ ఎన్నికల్లో సహకరించడం లేదు. ఇప్పుడు నామినేషన్‌కు రాలేకపోవడంతో పార్టీ కార్యకర్తల్లో కలవరం మొదలైంది. మాధవీలత, రాజా సింగ్ మధ్య విభేదాలు హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
KCR Live Interview Present Politics: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓ ఛానల్లో తొలిసారి ఇంటర్వ్యూకు వచ్చారు. ఈ సందర్భంగా నాలుగు నెలల్లో జరిగిన రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Barrelakka Filed Nomination For Lok Sabha Elections: అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన బర్రెలక్క మరో కీలక అడుగు వేసింది. మళ్లీ ఎన్నికల్లో నిలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేసింది.
KTR Big Positive Comments On Lok Sabha Polls: పార్లమెంట్ ఎన్నికలపై కేటీఆర్ పార్టీ నాయకులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కనున్నాయని పార్టీ నేతలతో పంచుకున్నారు.
Revanth Reddy Election Campaign In Adilabad: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు రావని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
Harish Rao Fire On Revanth Reddy In Medak Election Campaign: లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ స్థానం హాట్ హాట్ రాజకీయాలకు వేదికగా మారింది. మెదక్ రాజకీయాలు రేవంత్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావుగా మారాయి. మరోసారి రేవంత్‌పై హరీశ్ రావు విరుచుకుపడ్డారు.
Andhra Pradesh Congress Lok Sabha Candidates List With 9 Segments: ఏపీలో పాగా వేయాలనే లక్ష్యంతో భారీ వ్యూహం రచిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాను పూర్తి చేసింది. చివరి జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. వారిలో పార్టీని నమ్ముకుని ఉన్నవారికే ప్రాధాన్యం దక్కింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.