Amit Shah Telangana Tour: సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సన్నద్ధం చేసేందుకు బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన చేపట్టాల్సి ఉండగా.. అనివార్యంగా ఆయన పర్యటన రద్దయ్యింది. మూడు జిల్లాల పర్యటనకు షెడ్యూల్ కారణంగా వేరే ఇతర కారణాలతో ఈ పర్యటన రద్దయ్యిందని బీజేపీ ప్రకటించింది.
KTR meet With Karyakartas: అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టిన గులాబీ దళం ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలపై సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సమావేశానికి వెళ్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
BJP Focused LS Elecitons: సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి విజయంపై ధీమాగా ఉన్న బీజేపీ ఈసారి దక్షిణ భారతదేశంపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిసింది. దక్షిణాదిపై పట్టు సాధించేందుకు తెలంగాణే ప్రధాన కేంద్రంగా కమల దళం భారీ వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు అమిత్ షా పర్యటిస్తున్నారు.
Vijay Political Entry: సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తుండడంతో దేశ రాజకీయాలతోపాటు పలు రాష్ట్రాల్లో కూడా భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నదని సమాచారం. అక్కడి సూపర్ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నారని తీవ్ర చర్చ కొనసాగుతోంది. కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం.
Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానమైన కరీంనగర్‌ను తిరిగి నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. మరోసారి అక్కడి నుంచి బండి సంజయ్‌ను బరిలోకి దింపాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. పార్టీ ఆదేశాల మేరకు సంజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండగా.. ఆ సభకు అమిత్ షా రానున్నారు.
Fight in Social Media: హామీలపై ప్రశ్నిస్తే 'చెప్పుతో కొట్టాలి' అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీలను అమలు చేయలని కాంగ్రెసోళ్లను ఏ 'చెప్పు'తో కొట్టాలని ప్రశ్నించారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ సభలో పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
INDIA Alliance Break: ప్రతిపక్ష ఇండియా కూటమికి ఒకే రోజు ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకటి కాదు రెండు అనూహ్య సంఘటనలు సంభవించాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మొదట తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించగా.. ఆ కొద్దిసేపటికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే ప్రకటించింది. ఇరు పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తామని ప్రకటించడంతో ఇండియా కూటమిలో కలకలం ఏర్పడింది.
Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తన రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ప్రకటించి సంచలనం రేపారు. దీంతో ఇండియా కూటమిలో కలకలం రేపింది. జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Barrelakka in Lok Sabha Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన బర్రెలక్క మరో అడుగు ముందుకువేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాదిరి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని తాజాగా ప్రకటించింది. ఎన్నికలు ఏదైనా నిరుద్యోగుల గొంతు విప్పేందుకు బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించింది.
Didn't Expected Result: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఈ క్రమంలో లోక్‌సభ సెగ్మెంట్లవారీగా చేపట్టిన సన్నాహాక సమావేశాలు ముగిశాయి. చివరి రోజు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంపై సమావేశం నిర్వహించగా.. ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
BJP Target to win 350 Lok Sabha Seats: వచ్చే ఎన్నికల్లో 350 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అందుకు తగినట్లు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి.. కేంద్ర మంత్రులు, సీనియర్లకు బాధ్యతలు అప్పగించింది.
Anti Bjp Parties: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నాయి.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పూర్తి ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే ఓవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోల్ అయిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పలు చోట్ల బీజేపి ఆధిక్యం కనబర్చగా.. మరోవైపు సాధారణ ఓట్లలో పలు చోట్ల టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా.. ఇంకొన్ని స్థానాల్లో బీజేపి ఆధిక్యం కనబరుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.