టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్డేట్ రానే వచ్చింది. సినిమా విడుదల తేదీపై సైతం ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా విడుదలైన పోస్టర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
RRR Movie Latest News: టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ అప్డేట్ రానే వచ్చింది. సినిమా విడుదల తేదీపై సైతం ఓ క్లారిటీ వచ్చింది.
RRR Movie Resumes shoot: బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie). కరోనా వ్యాప్తితో విరామం ప్రకటించిన ఆర్ఆర్ఆర్ షూటింగ్ నేటి నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్వో బీఏ రాజు టీమ్ ట్వీట్ చేసింది.
Ram charan movie: సంచలన దర్శకుడు శంకర్, క్రేజీ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పుడు అందరి చూపూ ఈ కాంబినేషన్‌పైనే. మరి ఈ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. హీరోయిన్ ఎవరనేది ఖరారైందని సమాచారం.
Ram Charan's letter to fans: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానులను అభినందిస్తూ వారికి ఓ లేఖ రాయడమే కాకుండా ఆ లేఖను ట్విటర్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. తమ అభిమాన నటుడు తమని అభినందిస్తూ రాసిన లేఖ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Ram Charan looking at Ravi Teja for Driving licence Telugu remake: రామ్ చరణ్ డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ విషయంలో తన ప్లాన్ మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఖైదీ నెంబర్ 150 సినిమాతో నిర్మాతగా మారిన రామ్ చరణ్ ఆ తర్వాత సైరా నర్సింహా రెడ్డి, ఆచార్య వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు.
RRR Movie Latest Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో పోషిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీకి రాబోతోంది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా, రామ్ చరణ్, ఎన్టీఆర్లకు కరోనా లాంటి పలు కారణాలతో షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది.
Chiranjeevi oxygen banks: ప్రాణాపాయ స్థితిలో ఉండి రక్తం లేని కారణంగా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడే ప్రాణాలను రక్షించాలనే దృఢ సంకల్పంతో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో చిరంజీవి బ్లడ్ బ్యాంకును (Chiranjeevi blood bank) స్థాపించారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు కానున్న ఆక్సీజన్ బ్యాంకులు (Oxygen banks) మరో వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులో రానున్నాయి.
Jr Ntr about RRR movie, SS Rajamouli: కరోనా బారిన పడిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా నుంచి కోలుకుంటున్నాడు. కరోనా సోకడంతో పాటు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఎన్టీఆర్ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాబోయే చిత్రాల గురించి పలు ఆసక్తికరమైన అంశాలు అభిమానులతో పంచుకున్నాడు.
Wear mask, take COVID-19 vaccine- RRR team: కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా కట్టడి చేయొచ్చో చెబుతూ దర్శకధీరుడు రాజమౌళి ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలో కీలక పాత్రలు పోషిస్తోన్న రామ్ చరణ్, తారక్, ఆలియా భట్, అజయ్ దేవగన్ లతో కలిపి ఓ వీడియో సందేశం రూపొందించారు.
Ugadi greetings poster from RRR movie: నేడు ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ తమ అభిమానుల కోసం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ మూవీ నుండి ఓ కొత్త పోస్టర్ విడుదల చేసింది. ఉగాది పండగను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో జరుపుకునే ఆనవాయితీ ఉన్నందున.. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ కోసం ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ఆయా భాషల్లో ఉగాది గ్రీటింగ్స్ తెలియజేసింది.
Pooja Hegde In Acharya Movie | సక్సెస్ఫుల్ ఫార్ములాతో ముందుకు సాగుతున్న దర్శకుడు కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవి సరసన చందమామ కాజల్ అగర్వాల్ మరోసారి జత కట్టిన ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే చాలు అభిమానులకు ప్రత్యేక ఉత్తేజం కలుగుతుంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త హల్చల్ అవుతోంది. కారణం చిరు ఎవరిని ఫాలో అవుతున్నారనేది తెలియక. ఫాలోవర్ల సంఖ్య ఎందుకు మారుతోంది..
Ajay Devgn Motion Poster From RRR: ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ నుంచి నేడు ఓ ఆసక్తికరమైన అప్డేట్ వచ్చేసింది. గతంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పుట్టినరోజు సందర్భంగా వారి మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
Ram Charan birthday celebrations video: రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ మెగా పవర్ స్టార్‌కి ఊహించని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీ డైరెక్టర్ రాజమౌళి అంటేనే క్రియోటివిటీకి పెట్టింది పేరనే సంగతి తెలిసిందేనాయే. అందుకే చెర్రీకి తన స్టైల్లోనే HBD Ram Charan అని రాసి ఉన్న భారీ హోర్డింగ్ని సినిమా షూటింగ్స్‌కి ఉపయోగించే భారీ క్రేన్స్ సహాయంతో గాల్లోకి లేపుతుంటే, అప్పుడు చెర్రీ ముఖంలో కనిపించిన ఆనందం అంతా ఇంతా కాదు.
Ram Charan Birthday Gift | తండ్రి నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన షూటింగ్లో తన పాత్ర షూట్ ముగించుకున్నాడు రామ్ చరణ్.
Ram Charan as Alluri Sitaramaraju: ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో ఉన్న పోస్టర్‌ను ఆ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశాడు. మార్చి 27న మెగా పవర్ స్టార్ Ram Charan's Birthday కావడంతో అంతకంటే ఒకరోజు ముందుగానే చెర్రీ ఫ్యాన్స్ కోసం చెర్రీ బర్త్ డే కానుకగా ట్విటర్ ద్వారా జక్కన్న ఈ పోస్టర్ని విడుదల చేశాడు.
Alia Bhatt's first look in RRR movie: ఆర్ఆర్ఆర్ మూవీలో ఆలియా భట్ పాత్ర ఏంటి ? ఎలా ఉండబోతుంది ? అనే విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి చూపించే వాళ్లందరికీ సమాధానం లభించింది. SS Rajamouli డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్‌కి ఆలియా భట్ సతీమణి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.
Ram Charan's role in Acharya movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ ముగించుకున్నాడు. 20 రోజుల పాటు జరిగిన ఆచార్య లేటెస్ట్ షెడ్యూల్లో రామ్ చరణ్, చిరంజీవిలపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ షూటింగ్ ముగించుకున్న చరణ్, Rajamundry airport కి చేరుకుని అక్కడి Rajamundry - Hyderabad flight ద్వారా నుంచి హైదరాబాద్ వచ్చేశాడు.
Acharya movie shooting: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. RRR shooting లో రీసెంట్ షెడ్యూల్ ముగించుకున్న రాంచరణ్.. ప్రస్తుతం ఆచార్య షూటింగ్లో పాల్గొంటున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.