విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ చేసిన వెంకటేశ్ అయ్యర్.. ఆ శతకంను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు అంకితం చేశాడు. చిన్నప్పటినుంచి రజనీకి వీరాభిమాని అయిన వెంకీ.. శతకం అనంతరం సూపర్ స్టార్ స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు.
Sourav Ganguly: టీమ్ ఇండియా క్రికెట్లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీ20తో పాటు వన్డే కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించాడు. ఈ నేపధ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ షాకింగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ టూర్లో వన్డే సిరీస్‌కు విరాట్ దూరంగా ఉండనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిసిస్తున్నాయి.
నేడు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల పెళ్లి రోజు. విరుష్క జోడి వివాహ బంధంలోకి అడుగుపెట్టి శనివారంకు నాలుగేళ్లు పూర్తయ్యాయి.
టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించారు. కెప్టెన్సీ మార్పు చేయడానికి గల కారణాన్ని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సరిగ్గా చెప్పలేకపోయిందన్నారు.
2021 సంవత్సరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వ్యక్తిగతంగా ఏమాత్రం కలిసిరాలేదు. 2021 కోహ్లీకి దాదాపుగా నిద్రలేని రాత్రులనే మిగిల్చింది. ప్రస్తుతం టెస్ట్ సారథిగా ఉన్న కోహ్లీకి 2021 ఎలాంటి చేదు అనుభవాలను మిగిల్చిందో ఓసారి చూద్దాం.
టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించడంపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా స్పందించాడు. కోహ్లీ విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరును అతడు తప్పుబట్టాడు.
దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' పంజా విసురుతున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రస్తుతం టెస్టు, వన్డే సిరీస్ మాత్రమే ఆడుతామని.. టీ20 సిరీస్ తర్వాత ఆడుతామని స్పష్టం చేసింది.
ఇటీవలే భారత జట్టు టీ20 పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మకు త్వరలోనే మరో బాధ్యత కూడా అప్పజెప్పే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్‌గా రోహిత్‌ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోందట. ప్రస్తుతం టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న అజింక్య రహానేను తప్పించి రోహిత్‌కు ఆ పదవి ఇవ్వనుంది.
CSK Retained Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022కు సర్వం సిద్ధమవుతోంది. 2022 జనవరిలో మెగా ఆక్షన్‌కు సిద్ధమవుతుండటంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిటైన్డ్ ప్లేయర్స్ జాబితా విడుదల చేసింది. ముందుగా చెన్నై సూపర్‌కింగ్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లను పరిశీలిద్దాం.
టీమ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ టూర్‌పై సందిగ్దత నెలకొంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన భయంకరమైన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరగడమే దీనికి కారణం.
టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే దేశవాళీ సీజల్లో బరోడా జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని కృనాల్ నిర్ణయించుకున్నాడు.
టీమిండియా ఆటగాళ్లు రోహిత్, శ్రేయస్, శార్దుల్ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జరుగుతున్న మ్యాచ్ లో శ్రేయస్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.
Indias cricket tour in jeopardy as South Africa likely to suspend all sports due to new COVID-19 variant: డిసెంబరు 17 నుంచి 2022 సంవత్సరం జనవరి 26 వరకు టీమ్ఇండియా, దక్షిణాఫ్రికాలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా టీమ్ఇండియా దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడనుంది.
Kapil Dev: హార్ధిక్ పాండ్యాకు ఆల్‌రౌండర్ ట్యాగ్ తొలగించాలన్నాడు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. బౌలింగ్ వేయనప్పుడు అతడిని ఆల్ రౌండర్ అనడంలో అర్థం లేదన్నాడు.
మొదటి టెస్టులో తొలిరోజు ఆర్త ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పయిన భారత్ 258 పరుగులు చేసింది. శుభ్‌మన్, పుజారా కలిసి కివీస్ కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు.. తొలిరోజు ఆట హైలైట్స్..
రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది. టాస్ గెలిచినా భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
తాజాగా టీమిండియా ఆటగాళ్ల కోసం బీసీసీఐ విడుదల చేసిన ఫుడ్ మెనూ తీవ్ర విమర్శలకు దారీ తీస్తుంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో బీసీసీఐపై పెద్ద దుమారమే లేసింది.. అదేంటో మీరే చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.