అనుకున్నట్లుగానే తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. ఎమ్మెల్యే సహా పలువురు అసెంబ్లీ సిబ్బందికి, జర్నలిస్టులకు, పోలీసులకు కరోనా సోకిన నేపథ్యంలో సభ నిరవధిక వాయిదా (Telangana Assembly Adjourned Sine die) వేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత శాసనసభ ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.
కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నెర్ర చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు పౌరసత్వ సవరణ చట్టం 2019కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.
తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు. యూపీఏ ప్రభుత్వంలో.. ఇప్పుడున్న NDA ప్రభుత్వంలోనూ తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. లేక లేక 60 ఏళ్లకు వచ్చిన అధికారాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏదైతే జరగకూడదని ఆ పార్టీ భయపడుతూ వస్తుందో.. తాజాగా అదే జరిగింది.
రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో భాగంగా అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి జాతీయ జెండా ఎగురవేయగా మరోవైపు శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ జెండా ఎగురవేశారు.
ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమౌతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తూ టీడీపీ, బీజేపీ నేతలు అసెంబ్లీ వరకు నిసరన ర్యాలీ నిర్వహించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి, జొన్న, పత్తిని ప్రదర్శిస్తూ ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు. అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ఎల్బీస్టేడియం నుంచి అసెంబ్లీ వరకూ కొనసాగిన ఈ ర్యాలీలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.