తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి అనూహ్య పరిస్థితులు ఎదురయ్యాయి. అలిపిరి సమీపంలో ఆయన కాన్వాయ్‌ను కొందరు యువకులు అడ్డుకొని తమ నిరసనను తెలిపారు.
సోమవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివార్లని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం రాఘవేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా పోరాటంలో సినీపరిశ్రమ మద్దతు ఉంటుందని అన్నారు. హోదా కోసం నిరసన తెలుపుతూ గత 40 ఏళ్లుగా పెంచుకున్న గడ్డాన్ని స్వామివారికి సమర్పించినట్లు తెలిపారు. గతంలో మోదీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని, తెలుగువారికి ఏ కష్టం వచ్చినా టాలీవుడ్ అండగా నిలబడుతుందని పేర్కొన్నారు.