గతకొంతకాలంగా వివాదాస్పదంగా మారిన టీటీడీ భూముల అమ్మకాలపై ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం హయాంలో టీటీడీ బోర్డు దేవస్థానానికి చెందిన 52 ఆస్తులను వేలం వేయాలని సూచించిందన్నారు. అంతేగాక ఆ బోర్డులో బీజేపీ సభ్యులు కూడా ఉన్నారని గుర్తుచేశారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మద్యం, మాంసం నిషేధం అని తెలిసి కూడా ఓ జర్నలిస్ట్ తన కారులో మద్యాన్ని, మాంసాన్ని తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. అలిపిరి టోల్‌గేట్ వద్ద బుధవారం భద్రతా సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్టు టిటిడి విఎస్‌వో ప్రభాకర్ మీడియాకు తెలిపారు.
అలనాటి అందాల తార స్వర్గీయ శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. జాన్వీ కపూర్ తన స్నేహితురాలితో కలిసి సోమవారం వేకువజామున కాలినడకన అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆదివారం సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీసమేతంగా వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం.. అమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించటం ఆనవాయితీ.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని తెలిపిన ఆ ఆలయ మాజీ అర్చకులు రమణ దీక్షితులపై అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య సలహాదారు కోట శంకరశర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.