Padmasri Dr Gopala Krishna Gokale conferred with zee telugu news health conclave award: డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే.. ప్రముఖ కార్డియో థొరాసిక్ వైద్య నిపుణులు. తెలుగు రాష్ట్రాలలో తొలి గుండె మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్యులు. నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వృత్తిని ప్రారంభించిన ఆయన.. దేశ, విదేశాల్లో వైద్యరంగంలో సాధిస్తున్న పురోగతిని అందిపుచ్చుకుంటూ నిరుపేదల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
Dr Shiva Ranjani conferred with zee telugu news health conclave award: డాక్టర్ శివరంజని. పూర్తి స్థాయి పీడియాట్రిషియన్‌గా 17ఏళ్ల వృత్తి అనుభవం కలిగిన ఆమె.. కొవిడ్ విజృంభించిన సమయంలో డాక్టర్‌గా వైద్య సేవలు అందించడంతో పాటు జనానికి అవగాహన కల్పించడంలో విశేష కృషి చేశారు. కొవిడ్ బారిన పడిన తమ పిల్లలను సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లేలా చాలా మంది తల్లిదండ్రులకు శివరంజని అవగాహన కల్పించారు.
Dr Sriramana conferred with zee telugu news health conclave award: డాక్టర్ శ్రీరమణ. తన గురువు ఎక్కిరాల కృష్ణమాచార్య, తండ్రి డాక్టర్ జగన్ మోహన్ రావుల స్పూర్తితో దేశవ్యాప్తంగా అనేక చోట్ల వందకు పైగా స్వచ్ఛంద హోమియో డిస్పెన్సరీలను ప్రారంభించి రోగులకు ధార్మిక మార్గంలో సేవలందిస్తున్నారు.
Eye specialist Dr N Naveena : డాక్టర్ నవీన. క్లియర్ విజన్ ఐ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ & చీఫ్ కన్సల్టెంట్. పలు ఆసుపత్రుల్లో నేత్రవైద్య నిపుణురాలిగా సేవలందించారు. ప్రేరణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో, వెనుకబడిన జిల్లాల్లో అనేక వైద్య శిబిరాలను నిర్వహించారు. నిరుపేద వృద్ధులకు ఉచితంగా శస్త్రచికిత్సలు, మందులు, దుస్తులు పంపిణీ చేస్తారు.
Dr. Sree Bhushan Raju gets Zee Telugu News Health Conclave Award : డాక్టర్ శ్రీభూషణ్ రాజు. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు. పేదల మనసెరిగి, వాళ్లకు మానసికంగానూ ఉపశమనం కలిగేలా వైద్య చికిత్స అందించే అరుదైన డాక్టర్. రెండు దశాబ్దాలుగా నిమ్స్‌లో ఫ్యాకల్టీగా, నెఫ్రాలజీ స్పెషలిస్టుగా అనుభవం ఆయన సొంతం. ఎక్కడెక్కడి నుంచో తన దగ్గరకు వచ్చిన రోగులు.. ఎప్పుడు కాల్ చేసినా పలుకుతారు. ఫోన్లోనే ఓపిగ్గా సందేహాలు తీరుస్తారు.
MPHEO Mandati Srinivas: డాక్టర్ కావాలన్నది ఆయన కల. కానీ, అది నెరవేరలేదని అక్కడితో ఆగపోలేదు. కనీసం పారా మెడికల్ ఉద్యోగిగానైనా సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో అడుగులు వేశారు. అదే ఆయన్ను అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకునేలా చేసింది. ఆయనే MPHEO మందాటి శ్రీనివాస్.
Sharon Roja Gets Zee Telugu News Health Conclave Award: షారోన్ రోజా, వైద్యరంగంలో 19 ఏళ్లుగా స్టాఫ్ నర్స్ గా సేవలందిస్తున్నారు. కరోనా సమయంలో అత్యవసర విభాగంగా నర్సుగా ఎనలేని సేవలు అందించారు. రోగులను కంటికి రెప్పలా కాపాడటంతో పాటు వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ధైర్యం చెప్పారు.
Dr Lakshmi Lavanya, Endocrinologist: ఆధునిక జీవనశైలి ఎన్నో రకాల వ్యాధులకు కారణమవుతోంది. ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎంతోమంది తీవ్రవేదన అనుభవిస్తున్నారు. దేశంలో ఒక పెద్దసమస్యగా మారుతున్న హార్మోనల్ వ్యాధుల నియంత్రణ కోసం తీవ్రంగా కృషిచేస్తున్నారు డాక్టర్ లక్ష్మీ లావణ్య ఆలపాటి.
Zee Telugu News Health Conclave Cum Awards: తల్లి జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. కనిపించే దేవుడిలా ఆయువుపోస్తారు. రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి వైద్యుల గొప్పతనాన్ని మరోసారి ఎలుగెత్తి చాటిచెప్పింది. అలాంటి వైద్య సిబ్బంది సేవలను మరోసారి గుర్తుచేసుకుంటూ... సమాజహితం కోసం పాటుపడుతున్న వైద్యులను సగర్వంగా సత్కరిస్తోంది మన జీ తెలుగు న్యూస్.
Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న... తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలె బీజేపిలో చేరిన తీన్మార్ మల్లన్నకు అంతకంటే ముందు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందలేదా ? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నాను అని చెబుతున్న తీన్మార్ మల్లన్న మాటల్లో ఆంతర్యమేంటి ? 2023 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేస్తారా ? చేస్తే ఎక్కడి నుంచి బరిలో నిలబడతారు ? తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలరా ? ఇవే కాదు.. ఇలాంటి ఇంకెన్నో సందేహాలకు స్వయంగా తీన్మార్ మల్లన్న నోటే సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు జీ తెలుగు న్యూస్ డిజిటల్ టీవీ ఎడిటర్ భరత్.
Kalyanam Kamaneeyam serial launching: జీ తెలుగు అంటేనే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అనే సంగతి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గుండెకు హత్తుకునేలా, కళ్ల ముందు కదలాడే పాత్రలను ఆడియెన్స్ ఓన్ చేసుకునేలా సీరియల్స్ తెరకెక్కించి బుల్లితెర అభిమానులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందే ఉండే జీ తెలుగు టీవీ ఛానెల్ (Zee Telugu TV channel).. తాజాగా కళ్యాణం కమనీయం అనే మరో సరికొత్త సీరియల్‌తో అభిమానుల ముందుకొస్తోంది. కళ్యాణం కమనీయం సీరియల్ కథా, కమామిషు, ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం పదండి.
ZEE Launches New Channel: సరికొత్త మార్పులతో జీ తెలుగు న్యూస్ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ డిజిటల్ న్యూస్ ఛానల్స్ అందుబాటులోకి వచ్చాయి. జీ మీడియా ఛైర్మన్, రాజ్యసభ సభ్యులు డా. సుభాష్ చంద్ర వర్చువల్ గా ఈ నాలుగు ఛానల్స్ ను మంగళవారం ప్రారంభించారు.
Zee Telugu Digital Tv: జీ తెలుగు న్యూస్ డిజిటల్ ఛానెల్ అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు.
Zee Digital Tv: ప్రతిష్ఠాత్మక న్యూస్ మీడియా గ్రూప్ జీ మీడియా మరో వినూత్న ప్రయోగం చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ టీవీ ప్రారంభిస్తోంది. ఒకేసారి నాలుగు దక్షిణాది భాషల్లో జీ మీడియా డిజిటల్ టీవీ ప్రసారాలు ప్రారంభం కానున్నాయి.
ప్రపంచం నలుమూలలా నిత్యం లక్షలాది ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా సంఘటనలను మీ దృష్టికి తీసుకొచ్చేందుకు చాలా న్యూస్ యాప్స్ ఉన్నాయి. కానీ ఏయే ఘటన ఎలా జరిగింది ? వాటి వెనుకున్న కారణాలు ఏంటి ? ఆ ఘటనలకు దారితీసిన పరిస్థితులు ఏంటి అవే వివరాలు ఎవ్వరూ మీకు చెప్పరు ? కానీ వాటన్నింటినీ ముందుకు తీసుకొచ్చేందుకు జీ హిందుస్తాన్ కృషిచేస్తోంది.
"విరాట్ కోహ్లీ నిజంగానే జీనియస్. ఆయన ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మెన్" అంటూ పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ భారత క్రికెట్ జట్టు రథసారథి విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.