Telangana Covid-19: రాష్ట్రంలో 1,300 దాటిన కరోనా మరణాలు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల క్రితం 2వేలకు పైగా నమోదైన కేసులు.. కాస్త ఇప్పుడు తగ్గుముఖం పట్టి.. 1500లకు చేరువలోనే నమోదవుతున్నాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసుల కన్నా.. రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది.

Last Updated : Oct 24, 2020, 10:24 AM IST
Telangana Covid-19: రాష్ట్రంలో 1,300 దాటిన కరోనా మరణాలు

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొన్నిరోజుల క్రితం 2వేలకు పైగా నమోదైన కేసులు.. కాస్త ఇప్పుడు తగ్గుముఖం పట్టి.. 1500లకు చేరువలోనే నమోదవుతున్నాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసుల కన్నా.. రికవరీ రేటు గణనీయంగా పెరుగుతోంది. అయితే గత 24 గంటల్లో శుక్రవారం ( అక్టోబరు 23 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,273 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఐదుగురు (5) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,30,274 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,303 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.  Also read: Navratri Day 8: దుర్గాదేవిగా, మహిషాసురమర్ధినీగా అమ్మవారి దర్శనం

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1708 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,09,034 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 19,937 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 90.77 శాతం ఉండగా.. మరణాల రేటు 0.56 శాతం ఉంది. Also read: CSK VS MI: చెన్నైని చిత్తు చేసిన ముంబై 

శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా 35,280 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 40,52,633 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  జీహెచ్ఎంసీ పరిధిలో 227 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.  Also read: Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ

telangana corona cases bulletin

 

 Also read: Tuck Jagadish shooting re-started: టక్ జగదీష్ షూటింగ్‌ మళ్లీ స్టార్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News