తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలోని దుబ్బాక ఉప ఎన్నికల ( Dubbaka Bypoll ) ప్రచార హోరు ముగిసింది. నవంబర్ 3న జరిగే ఓటర్ల తీర్పు మిగిలింది. చిన్న చిన్న సంఘటనలు మినహా..ప్రచారపర్వం ప్రశాంతంగానే సాగింది. ఏ పార్టీ ధీమా ఎలా ఉందో తెలుసుకుందాం..
రాజకీయ పార్టీల ప్రచార హోరు, ప్రత్యర్దులపై ఆరోపణలు, హామీలు, మాటల యుద్ధం మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారపర్వం మినీ ఎన్నికల్నే తలపించింది. ప్రచార పర్వం ఇవాళ సాయంత్రంతో ముగిసింది. నవంబర్ 3న పోలింగ్ ( Dubbaka Bypoll on november 3 ) జరగనుండగా..10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
1 లక్షా 98 వేల ఓటర్లున్న దుబ్బాక నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ ( TRS ) , బీజేపీ ( BJP ), కాంగ్రెస్ ( Congress ) పార్టీలతోపాటు, స్వతంత్ర పార్టీల అభ్యర్థుల హోరు కూడా కొనసాగింది. గెలుపుపై ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఒకే ఒక ఉపఎన్నిక కావడంతో అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికలో...అధికార టీఆరఎస్ పార్టీ తరపున దివంగత ఎమ్మెల్యే భార్య సోలిపేట సుజాత ( Sujatha ) బరిలో నిలిచారు. ఇక బీజేపీ నుంచి మాధవనేని రఘునందన్ రావు ( Raghunandan rao ), కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు. దుబ్బాక ఎన్నికల బరిలో మొత్తం 23 మంది పోటీ చేస్తున్నారు. Also read: GHMC Elections: తెరాసకు 104 సీట్లు ఖాయం: తలసాని
అధికారపార్టీ తరపున మంత్రి హరీష్ రావు ( Minister Harish rao ) , ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు ఉప ఎన్నిక బాధ్యతను తీసుకున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రచారం సాగించారు. బీజేపీ తరపున కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ( Kishan reddy ) , నిజామాబాద్ ఎంపీ అరవింద్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, డీకే అరుణలు ప్రచారాన్ని నిర్వహించారు. అటు కాంగ్రెస్ తరపున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, హనుమంతరావు, గీతారెడ్డి, దామోదర్ రాజనర్సింహ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. అధికారపార్టీ వైఫల్యాలే తమను గెలిపిస్తాయని బీజేపీ భావిస్తుంటే..చేపట్టిన సంక్షేమ పధకాలు తమను మరోసారి గట్టెక్కిస్తాయని టీఆర్ఎస్ భావిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ లపై ఉన్న వ్యతిరేకత తమను విజయం సాధించిపెడుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
ప్రచారపర్వం మొత్తం దాదాపుగా ప్రశాంతంగానే సాగింది. సిద్ధిపేటలో నోట్లకట్టలు లభ్యమైన సంఘటన మాత్రం టీఆర్ఎస్- బీజేపీ ( TRS- BJP ) మధ్య వివాదాన్ని పెంచింది. అధికారపార్టీ కావాలనే డబ్బులు తెచ్చి తమను ఇరికించిందనేది బీజేపీ చేస్తున్న ఆరోపణ. అడ్డంగా దొరికిపోయి..అబద్ధాలు ప్రచారం చేస్తోందని టీఆర్ఎస్ వాదిస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ అక్రమాల్ని అడ్డుకోవాలంటూ బీజేపీ ఎన్నికల కమీషన్ ను ఆశ్రయించడంతో..ఓ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడిగా ఎన్నికల కమీషన్ నియమించింది.
అటు పోలీసులు కూడా దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తనిఖీలు విస్తృతం చేశారు. దుబ్బాక ఉపఎన్నికపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గెలుపుపై పూర్తి ధీమాతో ఉంది.
నవంబర్ 3న జరిగే దుబ్బాక ఉపఎన్నిక కోసం 2 వేల పోలీసు సిబ్బందిని నియమించారు. 4వ తేదీ వరకూ నియోజకవర్గంలో సెక్షన్ 144 విధించారు. నియోజకవర్గంలో 315 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేయగా...89 ప్రాంతాల్ని సమస్యాత్మకంగా గుర్తించారు. కోవిడ్ వైరస్ నేపధ్యంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పోలింగ్ ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి వెయ్యి ఓట్లుండేలా చేశారు. కరోనా సోకిన రోగులకు, వృద్ధులకు, దివ్యాంగులకు కూడా ఈసారి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. Also read: Dubbaka Bypoll Campaign: నేటితో దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి తెర